తెలంగాణ

తెలంగాణలో ఎండిన జలాశయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వేసవి ప్రారంభం కాకముందే తెలంగాణలో తీవ్ర మంచినీటి ఎద్దడి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఎండలు ముదిరేసరికి ప్రజలు గక్కెడు మంచినీటి కోసం కటకటలాడే పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోగా, మరోవైపు మంచినీటి అవసరాలను తీర్చే జలాశయాలు మునుపెన్నడూ లేని విధంగా ఎండిపోయాయి. దీంతో మున్ముందు తీవ్రతరం కాబోతున్న మంచినీటి ఎద్దడి సమస్య రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మంచినీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు, ఇప్పటినుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రూ. 300కోట్లు విడుదల చేసింది. మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న గ్రామాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. ఇలా ఉండగా రాష్ట్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో జూరాల ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ వరకు, అలాగే గోదావరి పరీవాహక ప్రాంతంలో శ్రీరామ్‌సాగర్ నుంచి సింగూర్ వరకు దాదాపు అన్ని జలాశయాలలోనూ నీటిమట్టం డెడ్‌స్టోరేజి కంటే దిగువకు పడిపోవడం తీవ్ర అందోళన కలిగిస్తోంది. జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటిపోవడంతో మంచినీటి ఎద్దడితో పాటు విద్యుదుత్పత్తిపైనా ప్రభావం పడబోతోంది.
జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తి నీటిమట్టం (్ఫల్ రిజర్వాయర్ లెవల్) 11.94 టిఎంసిలు కాగా, ప్రస్తుతం కేవలం 3.80 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం పూర్తి నీటిమట్టం 215 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 42.02 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలాశయం పూర్తి నీటిమట్టం 312 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 128.63 టిఎంసిల నీటిమట్టానికి పడిపోయింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు జలాశయం పూర్తి నీటిమట్టం 90.31 టిఎంసిలు కాగా ప్రస్తుతం దీంట్లో 5.46 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. ఇక నిజాంసాగర్, ఎల్‌ఎండి, సింగూర్ జలాశయాల్లోనూ నీటిమట్టాలు డెడ్ స్టోరేజీ కంటే దిగువకు పడిపోయాయి. హైదరాబాద్ నగరానికి మంచినీటిని అందించే మంజీరాలో నీటిచుక్క లేకుండా పూర్తిగా ఎండిపోయింది. వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే ఎండలు ముదిరేనాటికి జనం దాహార్తితో అల్లాడే పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి. రాష్ట్రంలో మంచినీటి ఎద్దడి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కలెక్టర్లు ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడ వద్దని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
బోధనాసుపత్రుల్లో 16మంది
అడ్మినిస్ట్రేటర్ల నియామకం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 1: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ బోధనాసుప్రతుల్లో 16 మంది హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లను (మేనేజర్లను) నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూపొందించిన నియమావళిలో స్వల్పమార్పులు చేశారు. అభ్యర్థులు నాన్-మెడికల్ గ్రాడ్యుయేషన్‌తో పాటు హాస్పిటల్ పరిపాలనలో రెండేళ్ల ఎంబిఎ కోర్సు పూర్తిచేసిన వారై ఉండాలని, అలాగే ఆసుపత్రుల్లో కనీసం మూడు సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.

90లక్షల ఇళ్లకు లెడ్ బల్బులు
తొలి దశలో వంద రోజుల్లో 12లక్షల బల్బులు పంపిణీ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 1: తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఎల్‌ఇడి బల్బులు వెలుగులను విరజిమ్మనున్నాయి. విద్యుత్‌ను ఆదా చేసి ఎక్కువ కాంతిని ఇచ్చే ఎల్‌ఇడి బల్బులను ప్రభుత్వం వినియోగదారులకు ఉచితంగా అందించనుంది. రాష్టవ్య్రాప్తంగా 90 లక్షల ఇళ్లకు ఎల్‌ఇడి బల్బులను సరఫరా చేయాలని నిర్ణయించారు. తొలి విడతగా వంద రోజుల్లో 25 మున్సిపాలిటీల పరిధిలో ఆరు లక్షల గృహాలకు 12 లక్షల ఎల్‌ఇడి బల్బులను సరఫరా చేయనున్నారు. ఆ తరువాత ఇతర మున్సిపాలిటీలకు ఎల్‌ఇడి బల్బులు అందజేస్తారు. మున్సిపాలిటీల్లో ఎల్‌ఇడి బల్బులను ఏర్పాటు చేసే అంశంపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు, ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. తొలి విడత 25 మున్సిపాలిటీల్లో ఎల్‌ఇడి బల్బులు అందజేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో లెడ్ బల్బులు సరఫరా చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇఎస్‌ఎస్‌ఎల్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ఈ సంస్థ ఎండితో మాట్లాడి సాధ్యమైనంత తక్కువ ధరకు ఎల్‌ఇడి బల్బులు సరఫరా చేయాలని మంత్రులు కంపెనీ ప్రతినిధులను కోరారు. గ్రామ పంచాయతీల్లో సైతం ఇదేవిధంగా ఎల్‌ఇడి బల్బులు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారకరామారావు అధికారులను ఆదేశించారు. రెండవ విడతగా త్వరలోనే రాష్టవ్య్రాప్తంగా ఉన్న వీధి దీపాలకు ఎల్‌ఇడి బల్బులనే ఉపయోగించనున్నట్టు చెప్పారు. మూడవ దశలో ప్రజలకు సబ్సిడీ మీద ఎల్‌ఇడి బల్బులు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ పొదుపు చేయనున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఎల్‌ఇడి బల్బులు కొనుగోలు చేస్తామని, ఈ బల్బులు బిగించే బాధ్యత విద్యుత్ శాఖ తీసుకుంటుందని తెలిపారు. త్వరలోనే నల్లగొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మొత్తం ఎల్‌ఇడి బల్బులు బిగించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు ఇంధన ఖర్చు తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తొమ్మిది వాట్ల ఎల్‌ఇడి బల్బులను ఉచితంగా అందజేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం చేసే ఖర్చు విద్యుత్ సంస్థలకు కరెంటు ఆదా రూపంలో తిరిగి వస్తుందని తెలిపారు.