తెలంగాణ

వెయ్యి కోట్లు ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: పంట రుణ మాఫీ మొత్తంలో ప్రభుత్వానికి రూ.1000 కోట్లు ఆదా కాబోతుంది. ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున రూ.17వేల కోట్లను బ్యాంకర్లకు తిరిగి చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే పంట రుణ ఖాతాలను వివిధ సంస్థల ద్వారా వడబోసి రైతుల పేరుతో డబుల్ ఖాతాలను ప్రభుత్వం గుర్తించింది. అంతకుముందు ప్రభుత్వం అంచనా వేసినట్టుగా రూ.17వేల కోట్లు కాకుండా రూ.16వేల కోట్లుగా లెక్క తేలింది. దీంతో ప్రభుత్వానికి రూ.1000కోట్లు ఆదా కాబోతుంది. లక్ష రూపాయల చొప్పున పంట రుణ మాఫీని పొందడానికి అర్హులైన రైతులను 35.30 లక్షల మందిగా ప్రభుత్వం గుర్తించింది. వీరికి ఉన్న ఖాతాల ప్రకారం 35 లక్షల మంది రైతులకు రుణ మాఫీ కోసం రూ.17 వేల కోట్లు అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం సాధ్యం కాదని నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఏడాదికి రూ.4250 కోట్ల చొప్పున బ్యాంకర్లకు చెల్లించే విధంగా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ లెక్క ప్రకారం మొదటి విడతలో బ్యాంకర్లకు ప్రభుత్వం చెల్లించింది. అయితే రుణ మాఫీ చెల్లింపులలో కొందరు రైతులకు లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తం లబ్ధి అవుతున్నట్టు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో రెండో విడత రుణ మాఫీ చెల్లించే వాయిదాకు ముందు రైతుల ఖాతాలను ఆధార్ కార్డుతో సీడింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఒక్కో విడతలో రూ.250కోట్ల చొప్పున నాలుగు విడతలకు కలిపి సుమారు రూ.1000కోట్ల మిగులు కనిపించింది. ఒక్కో రైతు కుటుంబం లక్ష రూపాయల వరకు మాత్రమే రుణ మాఫీనికి అర్హులైనప్పటికీ రైతు భార్య, పిల్లల పేరిట వేర్వేరు బ్యాంకులలో ఉన్న ఖాతాలను ప్రభుత్వం గుర్తించింది. ఈ వ్యవహారం బయటపడిన వెంటనే రెండో విడతలో మొదటి విడతలో చెల్లించిన ఎక్కువ మొత్తాన్ని తగ్గించి రూ.3750 కోట్లను మాత్రమే బ్యాంకర్లకు చెల్లించింది. మొదటి విడత మిగులును రెండవ విడతలో సర్దుబాటు చేసి మూడవ విడత మొత్తాన్ని రూ.4018 కోట్లను మాత్రమే విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు రుణమాఫీ కోసం బ్యాంకర్లకు రూ.12,105 కోట్లు చెల్లించినట్టు శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యికోట్లు ఆదా అయినప్పటికీ ఒకేసారి చెల్లించడానికి మాత్రం ప్రభుత్వం అంగీకరించడం లేదు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం తగ్గడంతో ఒకే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.8 వేల కోట్లు భరించడం సాధ్యం కాదన్నది ప్రభుత్వం భావన. మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని నీతి అయోగ్ చేసిన సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో రాష్ట్రానికి అదనంగా రూ.2000 కోట్లు అప్పు తీసుకోవడానికి వెసులుబాటు లభించిన విషయం తెలిసిందే. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని కేంద్రం పెంచిన పక్షంలో పంట రుణ మాఫీని ఏకకాలంలో బ్యాంకర్లకు చెల్లిస్తామని గతంలో శాసనసభలో ముఖ్యమంత్రి మాట ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా కేంద్రం ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని పెంచడంతో రుణ మాఫీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని విపక్షాలు శాసనసభలో పట్టుబట్టాయి. అయితే ఉహించని విధంగా పెద్ద నోట్ల రద్దుతో రుణ మాఫీని ఒకేసారి చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు.