తెలంగాణ

వామపక్షాలు ఐక్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్/హైదరాబాద్, డిసెంబర్ 26: ఫాసిస్టు శక్తులను ఎదురించేందుకు వామపక్షాలు ఐక్యం కావాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కోరారు. సిపిఐ 91వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని సోమవారం హిమాయత్‌నగర్‌లోని ఎన్.సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేశోద్ధారకభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సురవరం మాట్లాడారు. స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో 1925 డిసెంబర్ 26న కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు.
సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 90 వసంతాలు పూర్తిచేసుకొని 91వ వసంతంలో అడుగుపెట్టిందని చెప్పారు. ఆనాటి స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టులు ఎంతో ధీరత్వంతో పోరాడారన్నారు. ఏనాడు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే తెలంగాణకు విముక్తి లభించిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు ప్రజల పక్షాన పాల్గొన్నది చరిత్ర అని దానిని ఎవరూ మార్చలేరని అన్నారు. సిపిఐ ఏనాడూ ఓట్లు, సీట్ల కోసం ఆరాటపడలేదని, నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుంటున్నట్టు చెప్పారు. దోపిడీ వ్యవస్థ ఉన్నంత కాలం కమ్యూనిస్టులు ఉంటారని, మనిషిని మనిషి దోచుకోనంత వరకు, సమసమాజ స్థాపనే లక్ష్యంగా కమ్యూనిస్టులు పనిచేస్తారని తెలిపారు. ఫాసిస్టు పార్టీలను ఎదురించేందుకు వామపక్షాలు ఐక్యం కావాలని కోరారు.

చిత్రం..సిపిఐ 91వ వార్షికోత్సవ సభలో
మాట్లాడుతున్న సురవరం సుధాకర్ రెడ్డి