తెలంగాణ

రాంగోపాల్ వర్మపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు దాఖలైంది. దర్శకుడు వర్మ తీసిన వంగవీటి సినిమా ఇటీవలే విడుదలైంది. ఆ సినిమాలో కాపుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, పరమ రౌడీలుగా చూపించారని వంగవీటి మోహన రంగా అభిమానులు ఎస్ కిరణ్‌కుమార్, వి అశోక్, విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శకుడు రాంగోపాల్ వర్మతోపాటు నిర్మాత దాసరి కిరణ్‌లపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో కోరారు. ఈ చిత్రం మొత్తం వాస్తవాలకు విరుద్ధంగా నిర్మించారని, తమ మనోభావాలను కించపరచేలా వంగవీటి టైటిల్ పెట్టి కాపుకాసే శక్తి..లాంటి పదాలను ఉపయోగించి కాపుల మనోభావాలను దెబ్బతీశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమాకి పెట్టిన కాపు కాసేశక్తి అనే ఉప శీర్షిక ద్వంద్వార్థం వచ్చేలా ఉందని వారు తెలిపారు. రౌడీలు అయ్యప్పలుగా వచ్చి చంపితే, అయ్యప్పలే వచ్చి చంపినట్టు ఈ చిత్రంలో చూపించారంటూ వారు ఫిర్యాదు చేశారు. ఈ సన్నివేశంపై అయ్యప్ప మాలధారణలో ఉన్న ఓ వ్యక్తి కూడా ఫిర్యాదు చేశాడని, వెంటనే ఆ సినిమా దర్శకుడు, నిర్మాతలపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.