తెలంగాణ

మంత్రులైనా ఉపేక్షించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: శాసనమండలిలో సభ్యులు మాట్లాడే సమయంలో నిబ్బరంగా ఉండాలని, సభలో ఉద్రిక్తత ఏర్పడకుండా మాట్లాడాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ సూచించారు. శాసనమండలిలో గృహనిర్మాణంపై మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా అధికార-విపక్షాల మధ్య వాగ్వాదం జరగగా, చైర్మన్ జోక్యం చేసుకున్నారు. ‘అబద్ధాలు’ అన్న పదాన్ని సభ్యులు ఎవరూ ఉపయోగించవద్దని, మంత్రులు సైతం ఈ పదాన్ని వినియోగిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏ అంశంపై చర్చ జరుగుతూ ఉంటుందో కేవలం ఆ చర్చకే పరిమితం కావాలని, అనవసరంగా ఉద్రిక్తపరిస్థితి కలిగించవద్దని సూచించారు.