తెలంగాణ

సమస్యలపై ప్రశ్నిసే..ఉలికిపాటెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: టిజాక్ చైర్మన్ కోదండరామ్ కొత్త సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు..టిఆర్‌ఒఎస్ వాగ్దానాలపైనే మాట్లాడుతున్నారు..ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు..దీనికే పాలకులు అంత ఉలిక్కిపడితే ఎలా? అని టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ అన్నారు. కేసిఆర్ ఒక నియంతలా పాలిస్తున్నారనడానికి కోదండరామ్‌పై టిఆర్‌ఎస్ చేస్తున్న మానసిక దాడులే నిదర్శనమని వారు అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ, కోదండరామ్ టిఆర్‌ఎస్ హామీలపైనే మాట్లాడుతున్నారని, దానిపై వివరణ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆయనపై మానసిక దాడికి పాల్పడడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని వారు ప్రశ్నించారు.