తెలంగాణ

ఇళ్లు కట్టి చూపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27:నిరుపేదలకు 2.60 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కట్టించి చూపిస్తామని, ఇందులో ఎవరికీ అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. మంజురు చేసిన 2.60 లక్షల ఇళ్లే కాకుండా భవిష్యత్తులో మంజురు చేయనున్న ఇళ్లను కూడా సకాలంలో నిర్మిస్తామన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ఏమవుతుందో తెలియనంత అమాయకత్వంలో ప్రభుత్వం లేదని అన్నారు. శాసనసభలో మంగళవారం బలహీన వర్గాల గృహ నిర్మాణం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై జరిగిన లఘు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన కుంభకోణంలో దోషులను త్వరలోనే జైళ్లకు పంపిస్తామని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే ఈ కుంభకోణం జరిగిందని, విచారణకు కూడా వారి హయాంలోనే ఆదేశించారని గుర్తు చేశారు. ఈ కుంభకోణంలో 500 మంది ఉద్యోగులపై చర్యలు కూడా తీసుకున్నారన్నారు. కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరగడంతో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ వారిని జైళ్లకు పంపించిందని ఎక్కడ ఆడిపోసుకుంటారోనని ఇంతకాలం ఆగినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. అయితే సభలో కాంగ్రెస్ సభ్యురాలు డికె అరుణ దోషులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించాక ఇక ఆగాల్సిన అవసరం తమకు లేదన్నారు. సిబిసిఐడి దోషులుగా తేల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని సభలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు డిమాండ్ చేయడం వల్లనే దోషులను జైళ్లకు పంపించబోతున్నామని, దీనికి డిమాండ్ చేసిన పార్టీలే బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, అయితే దానికి అనేక కారణాలు ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఆదరాబాదరగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించేసి ఓ పది వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే తమపై విమర్శలు వచ్చేవి కావని అన్నారు. ఇళ్లకు పకడ్బందీగా పిల్లర్స్ నిర్మించాలని, నాణ్యతలో రాజీ పడకూడదని ప్రభుత్వం భావించిందన్నారు. ఈ పథకాన్ని రాజకీయ లబ్ధికోసం కాకుండా పది కాలాలపాటు ఉండేలా, పేదలు గుర్తించుకునేలా నిర్మించాలన్నది తమ అభిప్రాయమని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు కేవలం నెగెటివ్ కోణంలో ఆలోచించడం మానుకోవాలని హితవు పలికారు. ఇళ్ల నిర్మాణానికి నిధుల సమస్య లేదన్నారు. ఇప్పటికే దీని కోసం ప్రభుత్వం రూ.17,600 కోట్లు ఆర్థిక సహాయం తీసుకోవడానికి ఒప్పందాలు చేసుకొని నిధులను సిద్ధంగా ఉంచుకుందన్నారు. లాభసాటి కాదనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్ల జాప్యం జరిగిందని వివరించారు. తక్కువ ధరకు సిమెంట్ సరఫరా చేయడానికి సిమెంట్ కంపెనీలను ఒప్పించామని, ఇసుకను కూడా ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గడచిన రెండేళ్లలో మంజూరు చేసిన 2.60 లక్షల ఇళ్లను కచ్చితంగా నిర్మించి చూపిస్తామని చెప్పారు. ఇప్పటికే 14 వేల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకానికి నిబంధనలను సవరించి ఒక్కో ఇంటికి రూ.లక్ష 50 వేలు ఇవ్వడానికి అంగీకరించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయడానికి రూ.1500 కోట్లు కేటాయించామని, ఇప్పటికే వీటికిగాను రూ.336 కోట్ల బకాయిలను చెల్లించామన్నారు. మిగతా డబ్బును కూడా చెల్లించడానికి రూ.1100 కోట్లు సిద్థంగా ఉన్నాయన్నారు. బలహీనవర్గాల ఇళ్లలో లబ్ధిదారుల ఎంపికను పూర్తిగా కలెక్టర్లకు అప్పగించి రాజకీయ జోక్యం లేకుండా చేశామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే 650 ఎకరాలను సేకరించి పెట్టినట్టు చెప్పారు. రాజీవ్ స్వగృహ పథకం కింద నిర్మించిన ఇళ్లను ఉద్యోగులు, హోంగార్డులు, పోలీసులకు ఇవ్వడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
గత అక్రమాలపై విచారణ:
మండలిలో కడియం ప్రకటన
డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణం నెమ్మదించిన మాట నిజమేనని మంత్రి కడియం శ్రీహరి శాసన మండలిలో అంగీకరించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు,రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప పథకాలపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి తరఫున కడియం మాట్లాడారు. తెలంగాణ జిల్లాల్లో 2003 వరకు 17.34 లక్షల ఇళ్లను నిర్మించారని, ఇందుకోసం 1805.26 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కడియం తెలిపారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో 24.91 లక్షల ఇళ్లను నిర్మించినట్టు ఇందుకోసం 9075 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు లెక్కలు రూపొందించారన్నారు. 2014 లో తమ (టిఆర్‌ఎస్) ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి పేదలకోసం 43.29 లక్షల ఇళ్లను రాజీవ్‌గృహకల్ప, జెఎన్‌యుఆర్‌ఎం, వాంబే, రాజీవ్ స్వగృహ పథకాల కింద నిర్మించినట్టు వివరాలు ఉన్నాయన్నారు. ఇన్ని ఇళ్లు నిజంగా కట్టించి ఉంటే ఇళ్లులేని పేదలు రాష్ట్రంలో ఎవరూ మిగిలి ఉండకూడదని పేర్కొన్నారు. అయితే వాస్తవంగా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న లెక్కలు తప్పని, వాస్తవాలు తేల్చేందుకు సిఐడి విచారణకు ఆదేశించామని తెలిపారు.