తెలంగాణ

సస్పెన్షన్.. ఉపనంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించాలని, ఢిల్లీకి అఖిల పక్షం తీసుకెళ్లి ప్రధానితో ఈ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు పోడియం వద్దకు దూసుకువెళ్లి బైఠాయించడంలో మంగళవారం సభలో గందరగోళం నెలకొంది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. కాగా ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి, బిజెపి నేత కిషన్ రెడ్డి చేసిన విజ్ఞప్తితో ప్రభుత్వం ముగ్గురిపై సస్పెన్షన్‌ను ఉపసంహరించుకుంది. మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎస్సీ వర్గీకరణ అంశంపై వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలని పట్టుబట్టారు. పోడియం వద్దకు దూసుకెళ్లారు. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలు ఉంటాయని, సభ కార్యక్రమాలకు ఆటంకం కలిగించవద్దని స్పీకర్ కోరినా వారు పట్టు వీడలేదు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సభ్యులు సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని, ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే శాసనసభ రెండు సార్లు తీర్మానం చేసిందని, సరైన రూపంలో వస్తే ఈ అంశంపై స్పీకర్ అనుమతితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పోడియం వద్ద కాంగ్రెస్, టిడిపికు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బైఠాయించి నినాదాలు చేస్తుండగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగింది. చివరకు మంత్రి హరీష్ రావు ఇద్దరు టిడిపి, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెండ్ చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుండగా, తమ పార్టీ సభ్యుడిని సస్పెండ్ చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి నిలబడ్డారు. ఈ లోగా విపక్షనేత జానారెడ్డి సభలోకి వచ్చారు. ముగ్గురు సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ వీలైనంత త్వరలో అన్ని పార్టీలనుకలుపుకుని ఢిల్లీకి వెళ్లి ప్రధానితో ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. ముగ్గురు సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఉపసంహరిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.