తెలంగాణ

మాదిగలపై కక్ష సాధింపు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, డిసెంబర్ 27: సిఎం కెసిఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నందుకే ఎమ్పార్పీఎస్‌పై కక్షసాధింపుధోరణి ప్రదర్శిస్తున్నారని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మంగళవారం సికిందరాబాద్‌లోని పార్శిగుట్ట కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో తెరాస ప్రభుత్వం ఎమ్మార్పీఎస్ పట్ల అనుసరిస్తున్న వైఖరి పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఆది నుంచి కేసిఆర్ దళితుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తున్నామని అందుకే మాదిగలకు సంబంధించిన వర్గీకరణకు ఆయన వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు మాదిగలను కించపరిచే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. అధికార పక్షం బాధ్యతలను విస్మరించి మాదిగలకు వ్యతిరేకంగా అణచివేత ధోరణితో ప్రవర్తిస్తున్నదని, తగిన సమయంలో తాము తగిన విధంగా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అసెంబ్లీలో ఎమ్మార్పీఎస్ వర్గీకరణ కోసం తీర్మానం చేయాలని పట్టుబట్టిన ఇద్దరు దళిత ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ప్రభుత్వ అహంకారానికి పరాకాష్టగా నిలిచిందన్నారు.