తెలంగాణ

సర్కారు ప్రచారానికి ఏడాదిలో రూ. 505 కోట్ల ఖర్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: తెలంగాణ శాసన మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల పర్వం ఆసక్తిగా కొనసాగింది. ఉదయం పది గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఏడాదిలోనే ప్రభుత్వం రూ. 505 కోట్లను ప్రచారానికి వినియోగించదని, ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని కోరారు. జర్నలిస్టుల హెల్త్‌కార్డులు, అక్రిడేషన్ కార్డుల విషయాన్ని ప్రస్తావించారు. కొత్త రాష్ట్రం ఏర్పడి, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా నేటికీ జర్నలిస్టులకు కనీసం అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. జర్నలిస్టులకు హెల్త్ స్కీంను సక్రమంగా అమలు చేయటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చిన్న పత్రికలకు కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రారావు సభ దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానం చెబుతూ కొత్త రాష్ట్రం ఏర్పడటం వల్ల, కొత్త ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలియజెప్పేందుకు అడ్వర్‌టైజ్‌మెంట్లను ఇచ్చినట్లు, ఇందుకు వెచ్చించిన రూ. 505 కోట్లను బడ్జెట్‌కు లోబడే ఖర్చు చేశామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ కింద వంద కోట్లను ప్రెస్ అకాడమీకి ఇచ్చిందని, హెల్త్ స్కీంలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసేందుకు జిల్లా, మండల కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కొత్త సంవత్సరానికి సంబంధించిన అక్రిడేషన్ కార్డుల జారీని పూర్తి చేస్తామని వెల్లడించారు.అంతకుముందు కాలుష్యకారక పరిశ్రమల తరలింపుపై కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు మంత్రి కెటిఆర్ సమాధానం చెప్పారు. అలాగే రహదారుల అభివృద్ధిపై నారాయణరెడ్డి, ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల తనిఖీకి సంబంధించి సభ్యులు ఎం.రంగారెడ్డి, షబ్బీర్ అలీ ప్రశ్నకు కడియం శ్రీహరి సమాధానం చెప్పారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఒక్క ఆసిఫాబాద్ జిల్లాలోనే డిగ్రీ కాలేజీ లేదని, ముఖ్యమంత్రి తో చర్చించి అక్కడ కాలేజీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని కడియం చెప్పారు.