తెలంగాణ

వందశాతం పన్నులు చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బచ్చన్నపేట, డిసెంబర్ 27: వరంగల్ రూరల్ జిల్లా బచ్చన్నపేట మండలంలోని దబ్బగుంటపల్లి గ్రామస్థులు వందశాతం ఇళ్లు, నల్లా పన్నులు చెల్లించి అధికారుల మన్ననలు అందుకున్నారు. మంగళవారం ఉదయం 8గంటల నుంచే పంచాయతీ కార్యాలయం వద్ద వరుసలో నిల్చోని బకాయి పన్నులు చెల్లించారు. గత 10 రోజులుగా పంచాయతీ అధికారులు మండలంలో మూడు బృందాలుగా ఏర్పడి అన్ని గ్రామాల్లో స్థానిక పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దబ్బగుంటపల్లి సర్పంచ్ ముక్కెర సుజాత, సామాజిక కార్యకర్త తిరుపతిరెడ్డి పన్నుల చెల్లింపులో గత వారం రోజులుగా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. మొత్తానికి బకాయి పన్నుల చెల్లింపుల విషయంలో గ్రామస్థులందరినీ అవగాహన పరిచారు. గ్రామంలో ఇంటి నల్లా పన్నులు 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,13,544లు ఉన్నాయి. ఇందులో గత బకాయిలు రూ.1,33,500లు కాగా ఈ ఏడాది రూ.80,044లు ఉన్నాయి. ఈ పూర్తి పన్నులు మంగళవారం ఒకే రోజు చెల్లించారు. ఇందుకు జిల్లా అధికారులు సైతం గ్రామస్థులను అభినందించారు. అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ ధనం ఎందుకు వృధా చేయాలని భావించి సర్పంచ్‌గా ముక్కెర సుజాతను ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రభుత్వం నుంచి రూ.10లక్షలు అవార్డు గెలుచుకున్న ఘనత దబ్బగుంటపల్లి గ్రామస్థులకే దక్కింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్కెర సుజాతతో పాటు ఇవోపిఆర్‌డి ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి రాజన్‌బాబు, బృందం సభ్యులు శివకుమార్, రవీందర్‌లు ఉన్నారు.