తెలంగాణ

కుడి కాలువకు మళ్లీ నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయం నుండి ఎడమ కాలువ పరిధిలో ప్రజలకు నీటి విడుదల చేసి తాగునీటిని అందించాలని ఆయకట్టు ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు వరుస ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని కృష్ణా నది యాజమాన్య బోర్డు బుధవారం రాత్రి సాగర్ నీటి విడుదల విషయంలో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో కుడి కాలువ ద్వారా ఆంధ్ర ప్రాంతానికి నీటి విడుదల చేయాలని సాగర్ డ్యాం అధికారులకు ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు రావడంతో హుటాహుటిన డ్యాం అధికారులు డ్యాంపైకి చేరుకుని కుడి కాల్వకు నీటి విడుదల ప్రారంభించారు. గత రెండు వారాల క్రితమే సాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా కృష్ణా డెల్టాకు 4.2 టిఎంసిల నీటిని విడుదల చేశారు. పక్షం రోజుల వ్యవధిలోనే మరోసారి కుడి కాల్వ ద్వారా ఆంధ్రకు నీరివ్వడాన్ని ఎడమ కాల్వ పరిధిలోని ప్రజలు, రైతులు జీర్ణించుకోలేపోతున్నారు. సాగర్ నుండి కుడి కాల్వకు మరోసారి నీటిని విడుదల చేయగా, ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, ఖమ్మం జిల్లా వాసులు తాగునీటి కోసం ఆందోళన చేస్తున్నా తెలంగాణ మంత్రులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో కనీస నీటిమట్టం 510 అడుగులకు రెండడుగులు తగ్గి 508 అడుగులుగా ఉంది. ఇప్పటికే రాబోయే రోజుల్లో ఎడమ కాలువ, ఎఎమ్మార్పీ ఎత్తిపోతల పరిధిలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాలతో పాటు జంటనగరాల పరిధిలోని ప్రజలకు తాగునీటి సమస్య జటిలం కానుందన్న ఆందోళన నెలకొన్న నేపధ్యంలో అకస్మాత్తుగా కుడి కాల్వ ద్వారా ఆంధ్రకు నీటి విడుదల చేయడం వివాదస్పదమైంది. కాగా కుడి కాల్వకు నీటి విడుదలపై ఎస్‌ఈ రమేష్ స్పందిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు నిర్ణయం మేరకు రోజుకు 6000 క్యూసెక్కుల చొప్పున ఐదు రోజుల పాటు 2.5 టిఎంసిల నీటిని సాగర్ జలాశయం నుండి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఎడమకాలువకు తాగునీటి విడుదలపై ఎలాంటి ఉత్తర్వులు అందలేదన్నారు.

సెస్ ఎన్నికల్లో
టిఆర్‌ఎస్ సునామీ
ఏకపక్షంగా ఓటరు తీర్పు
సిరిసిల్ల, మార్చి 2: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్) ఎన్నికల్లో టిఆర్‌ఎస్ సృష్టించిన సునామీతో ప్రతిపక్ష పార్టీలు, ప్రత్యర్థులు అధికార పార్టీ తాకిడికి తట్టుకోలేకపోయాయి. సెస్ బరిలో తలపడిన ప్రత్యర్థి పార్టీల అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. ఏ ఒక్క స్థానంలోనూ విపక్ష పార్టీలు తమ పట్టును నిలుపుకునే పరిస్థితి కానరాలేదు. అధికార పార్టీ సృష్టించిన ప్రభంజనంలో దాదాపు అన్ని స్థానాలు టిఆర్‌ఎస్ కైవసం చేసుకుని గులాబీ జెండాను ఎగురవేసింది. తొలి నుంచి ఊహించినట్టుగానే గురువారం జరిగే చైర్మన్ ఎన్నికలోనూ విజయం సాదించి పాలకమండలి పగ్గాలు చేపట్టబోతున్నది. ఈ ఎన్నికల్లో కనీసం కొన్ని స్థానాలైనా కైవసం చేసుకుని అధికార పార్టీ తీరును ఎండగట్టడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశకు గురైంది. జిల్లా నాయకులు సెస్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ప్రయత్నాలు సాగించినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక కనీసం నాలుగు స్థానాలైనా దక్కించుకుని గులాబీ పార్టీతో చెలిమి కలుపుకుని వైస్ చైర్మన్ పదవి రాబట్టుకోవాలని చేసిన ప్రయత్నాలు కూడా టిఆర్‌ఎస్ సునామీకి తట్టుకోలేకపోయాయి. ఇక టిడిపి నేరుగా ఎక్కడా పోటీ చేయకున్నా కొన్ని చోట్ల మద్దతు ఇచ్చినా తన ఉనికిని ప్రదర్శించలేకపోయింది. సెస్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో టిఆర్‌ఎస్ పోటీ పడి విజయం కోసం టిఆర్‌ఎస్ శ్రేణులు సైనికుల్లా పని చేయడంతో ఫలితం దక్కించుకున్నారు. మంత్రి తారకరామారావు ముందు ప్రజలిచ్చిన గౌరవాన్ని అందిపుచ్చుకుని మంత్రికి కానుకగా సమర్పించుకున్నారు. చివరి ఎన్నికలో విపక్షంలో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ సెస్ బరిలో దిగి గులాబీ జెండా ఎగురవేయగా, తిరిగి అధికారంలో ఉన్న ప్రస్తుత సమయంలోనూ సెస్‌పై తమ జెండాను ఎగురవేసి సత్తాను చాకున్నారు.
హాల్‌టిక్కెట్
ఇవ్వలేదని...
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్, మార్చి 2: ఇంటర్మీడియట్ పరీక్షల ప్రారంభం రోజే వరంగల్ జిల్లా మానుకోటలోని సోషల్ వెల్ఫేర్ కళాశాలకు చెందిన జూనియర్ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే... మానుకోటలోని సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపిసి చదువుతున్న ఎడ్ల పావని నెల్లికుదురు మండలం వావిలాలలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉరివేసుకుని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బుధవారం ఇంటర్‌మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానుండడంతో మంగళవారం హాల్‌టిక్కెట్ కోసం కళాశాలకు వెళ్లింది. హాజరుశాతం చాలా తక్కువగా ఉండటంతో హాల్‌టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించారు. ప్రిన్సిపాల్ విద్యులతను కలిసే ప్రయత్నం చేయగా పరీక్షలకు సంబంధించిన పని ఒత్తిడిలో ఉన్న ప్రిన్సిపాల్ పావనికి సమయం ఇవ్వలేదు. దీంతో హాల్‌టిక్కెట్ ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో పావని తీవ్ర మనస్తాపానికి గురై శ్రీరాంగిరికి వెళ్లకుండా అదే మండలంలోని తన పెద్దమ్మ, పెద్దనాన్నల గ్రామమైన వావిలాలకు మంగళవారం సాయంత్రం చేరుకుంది. పావని చుట్టపు చూపుగా వచ్చిందని భావించిన ఆమె పెద్దమ్మ మంగమ్మ, పెద్దనాన్న వెంకన్న పావనిని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. పరీక్షలు ప్రారంభమయ్యే సమయానికి తాను చనిపోవాలనే నిర్ణయానికి వచ్చిన పావని బుధవారం ఉదయం పెద్దమ్మ ఇంటిలో దూలానికి ఉరివేసుకుంది. అదృష్టవశాత్తు మంగమ్మ కొడుకు, వరుసకు పావనికి అన్న అయ్యే వ్యక్తి ఉరివేసుకున్న పావనిని రక్షించాడు. అపస్మారక స్థితిలో ఉన్న పావనిని సరైన సమయానికి మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. టౌన్ ఎస్సై ప్రసాద్‌రావు ఏరియా ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
సెప్టెంబర్ నుండి కళాశాలకు రావడం లేదు..
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థిని పావని గత సంవత్సరం సెప్టెంబర్ నుండి అనారోగ్య కారణం చెబుతూ కళాశాలకు రావడం లేదని సోషల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యుల్లత తెలిపారు. గతంలో కళాశాలకు రాని విషయంపై పావనిని సంజాయిషీ కోరామన్నారు. కళాశాలకు వచ్చే ఆలోచన తనకు లేనట్లుగా పావని చెప్పిందన్నారు. నిబంధనల మేరకు హాజరుశాతం చాలా తక్కువగా ఉండడంతో పరీక్ష విభాగం బాధ్యులు హాల్‌టిక్కెట్ ఇవ్వమని చెప్పారన్నారు. ఆ సమయంలో పావని హాల్‌టిక్కెట్ కోసం పెద్దగా ఒత్తిడి చేసింది కూడా లేదని, అడిగి వెంటనే కళాశాల నుండి వెళ్లిపోయిందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఏదేమైనా హాల్‌టిక్కెట్ ఇవ్వలేదనే కారణంతో తమ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమని ప్రిన్సిపాల్ అన్నారు. పావనికి హాల్‌టిక్కెట్ ఇస్తామని గురువారం నుండి పరీక్షలకు హాజరు కావచ్చని చెప్పారు.