తెలంగాణ

ప్రజలకు ముఖం చాటేస్తున్న సర్పంచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలకు ముఖం చూపించలేక సర్పంచ్‌లు తప్పించుకుని తిరిగే పరిస్థితి నెలకొందని తెలంగాణ రాజకీయ జెఏసి చైర్మన్ ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. కొంత మంది సర్పంచ్‌లు అర్థరాత్రి ఇంటికి చేరుకునే దుస్థితి నెలకొందని వాపోయారు. గ్రామ పంచాయితీలకు నిధులు, విధులు, అధికారాల కోసం సర్పంచుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద సర్పంచుల మహాధర్నా నిర్వహించారు. ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆందోల్ కృష్ణ అధ్యక్షతన జరిగిన మహాధర్నాకు కోదండరాం ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. సర్పంచ్‌ల ఉద్యమానికి టి.జాక్ మద్దతు ఉంటుందని ప్రకటించారు. గ్రామలే దేశానికి పట్టుకొమ్మలనీ, గ్రామాల అభివృద్ధితోనే దేశానికి వెలుగు నిండుతాయని పేర్కొన్నారు. 73, 74 వ రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామ పంచాయితీలకు అధికారాలను తెచ్చినా పటిష్టంగా అమలు కఅవటం లేదని విమర్శించారు. గ్రామ పంచాయితీల అధికారాలు అమలైతే బలహీన వర్గాలకు గ్రామపాలనలో భాగస్వామ్యం లభిస్తుందని అన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా సర్పంచులకు వచ్చిన 29 అధికారాలు, పూర్తి అధికారాలు గ్రామ పంచాయితీలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

చిత్రం..మంగళవారం సిపిఐ నిర్వహించిన అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తున్న కోదండరాం