తెలంగాణ

యురేనియం తవ్వకాలను అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్రాబాద్, డిసెంబర్ 27: నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్, పదర మండలాలలో యురేనియం ఖనిజ తవ్వకాల కోసం వణ్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ మంగళవారం మండల కేంద్రానికి వచ్చిన జాతీయ టైగర్ ప్రాజెక్టు అథారిటి అధికారి బిలాల్‌జీ, అమ్రాబాద్ టైగర్ ప్రాజెక్టు ఫీల్డు డైరక్టర్ ఫరిగేన్, డిఎఫ్‌ఓ జోజిలతోపాటు ఇతర అధికారులను వివిధ పార్టీలు, సంఘాల నాయకులు, ప్రజలు అడ్డుకున్నారు.
నల్లమల ప్రాంతంలో ఆదివాసి చెంచులతోపాటు ఇతర వర్గాల ప్రజలు 50 వేలమందికి పైగా జీవిస్తున్నారని, ఇలాంటి ప్రదేశాలలో యురేనియం ఖనిజ నిక్షేపాల తవ్వకాలకు అనుమతిని ఏవిధంగా ఇస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. సుమారు గంటపాటు అంబేద్కర్ చౌరస్తాలోనే వారి వాహనాలను అడ్డుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు కదలనివ్వలేదు. అటవీశాఖాధికారులు స్థానిక ఎస్సైకి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. అయినా వినకపోవడంతో అధికారులు వెనక్కివెళ్లిపోయారు.
నల్లమలలో యురేనియం తవ్వకాలపై సర్వేను పరిశీలించేందుకు వచ్చిన అధికారులు ప్రజల ఆందోళనతో వెనుదిరిగారు. ఈ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టినా గతంలో మాదిరిగానే ఉద్యమాలు చేపడుతామని ఆందోళనకారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు నాసరయ్య, లింగం, దివాకర్, మున్వర్ అలీ, సోమయ్య, వెంకటయ్య, జమీల్ పాల్గొన్నారు.

చిత్రం..అమ్రాబాద్‌లో అటవీశాఖ అధికారుల వాహనాలను
అడ్డుకుంటున్న వివిధ పార్టీల నాయకులు, ప్రజలు.