తెలంగాణ

బిఎస్‌ఎన్‌ఎల్ ఉచిత వైఫై సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 27: దేశంలోనే ద్వితీయ నగదు రహిత గ్రామంగా రాష్ట్రంలో తొలిగ్రామంగా గుర్తింపుపొందిన సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి బిఎస్‌ఎన్‌ఎల్ ఉచిత వైఫై సేవలను అందించేందుకు ముందుకొచ్చింది. పెద్దనోట్లరద్దు తర్వాత నగదురహిత లావాదేవీలకు ప్రాధాన్యతనివ్వడంతో ఇబ్రహీంపూర్ రాష్ట్రంలోనే క్యాష్‌లెస్‌గా గుర్తింపు పొందింది.
గ్రామంలో సుమారు 1219జనాభా ఉండగా 1048బ్యాంకు ఖాతాలు, ఏటిఎంకార్డులు కలిగి ఉన్నారు. గ్రామంలో కిరాణ, పాలకేంద్రం, హోటల్స్, రేషన్‌షాపువారు 11మంది స్వైప్‌మిషన్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఏయిర్‌టెల్ నెట్‌వర్క్ వినియోగిస్తున్నారు. నగదురహిత సేవలను మరింతవేగవంతం చేసేందుకు మంత్రి హరీష్‌రావు చొరవవల్ల గ్రామంలోని అందరికి ఉచితంగా వైఫై సేవలు అందించేందుకు బిఎస్‌ఎన్‌ఎల్ ముందుకొచ్చింది. గ్రామంలో వైఫైసేవలు అందించేందుకు పనులు ముమ్మరంగా చేపట్టారు. మంగళవారం టెస్టింగ్ సిగ్నల్ సైతం ప్రారంభించారు. పంచాయతీ కార్యాలయంలో బిఎండబ్ల్యు మెయిన్ ఆంటీనా నుంచి మరో 10వైఫై ఆక్సిస్‌పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. వందమీటర్లకు ఒక ఆక్సిస్‌పాయింట్ చొప్పున 10పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. బిఎండబ్ల్యు, ఓఎఫ్ కేబుల్ తెప్పిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మెయిన్ టవర్ నుంచి బదన్‌కల్, ఇబ్రహీంపూర్‌కు బిఎస్‌ఎన్‌ఎల్ వైఫై సేవలు అందిస్తున్నారు. గ్రామంలో 10రిసీవర్లు ఏర్పాటుతో పాటు 9గ్రామంలో, 1మార్కెట్ గోదాం వద్ద ఏర్పాటు చేశారు. వైఫైసేవలను మంగళవారం ప్రయోగాత్మకంగా పరిశీలించారు. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోనే బిఎస్‌ఎన్‌ఎల్ ఉచితంగా వైఫై సేవలు అందించిన గ్రామంగా ఇబ్రహీంపూర్ గుర్తింపు పొందనుంది. ఇప్పటికే పలు పథకాల అమలులో ఆదర్శంగా ఉన్న గ్రామం వైఫై సేవలు అందించడంలో కూడా గుర్తింపు పొందడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులు గ్రామస్తులకు సిమ్‌కార్డులను అందించనున్నారు.