తెలంగాణ

ఉగాదికి మెట్రో కూత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: మహానగరవాసుల చిరకాల స్వప్నమైన మెట్రోరైలు ప్రాజెక్టు మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటికే ప్రాజెక్టు ఆలస్యమయేందుకు ప్రధాన కారణమైన స్థల సేకరణలోని అడ్డంకులు అదిగమించే అంశంపై మెట్రోరైలు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే! మూడు కారిడార్లుగా నిర్మితమవుతున్న మెట్రో వచ్చే ఉగాది నాటికి గానీ జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వరకు గానీ కారిడార్ 1లోని మియాపూర్ నుంచి ఎస్‌ఆర్‌నగర్ వరకు 12 కిలోమీటర్లు, అలాగే నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు పది కిలోమీటర్ల వరకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ అనుమతులు మరో రెండు, మూడు నెలల్లో తెచ్చుకోగలిగితే ఉగాదికి రెండు కారిడార్లలోని 22 కిలోమీటర్లలో మెట్రోరైలు పరుగులు తీయనుంది. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రం అవతరించిన జూన్ 2లోపు అందుబాటులోకి తేనున్నారు. ఇందులో మియాపూర్ నుంచి ఎస్‌ఆర్‌నగర్ వరకు మెట్రోరైలును నడిపేందుకు మెట్రోరైల్ సేఫ్టీ మంజూరీ ఇచ్చినట్లు హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్.రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ప్రాజెక్టుకు రూ. 2902 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. మొత్తం 61 కిలోమీటర్ల పొడువులో 2340 పునాదులు, 2231 పిల్లర్లు(58కిలోమీటర్లు), అలాగే మరో 50 కిలోమీటర్ల ప్రధాన కారిడార్‌లో ఎలక్ట్రిక్ ట్రాక్షన్, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ సిస్టమ్‌తో పాటు ప్రాజెక్టు మొత్తం 75 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయినట్లు ఎండి ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.