తెలంగాణ

సెల్‌ఫోన్‌లపై ఇక వ్యాట్ 5 శాతమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28:సెల్‌ఫోన్ కొనుగోలుదారులకు శుభవార్త. రాష్ట్రంలో సెల్‌ఫోన్ విక్రయాలపై ఇక ఐదు శాతం మాత్రమే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) విధిస్తారు. ఈమేరకు వ్యాట్ చట్ట సవరణ బిల్లును బుధవారం శాసన సభ ఆమోదించింది. ప్రస్తుతం సెల్‌ఫోన్‌లపై 14.5శాతం వ్యాట్‌ను విధిస్తున్నారు. నగదు రహిత కార్యకలాపాలు పెంచేందుకు దోహదపడే సెల్‌ఫోన్లపై వ్యాట్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి తరఫున బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అన్ని పార్టీల సభ్యులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఐదు శాతానికి బదులు రెండు శాతం మాత్రమే వ్యాట్ ఉండాలని కాంగ్రెస్ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి సూచించారు. ప్రారంభంలో ప్రమోద్ మహాజన్ సెల్‌ఫోన్ ఉపయోగిస్తే అంతా చిత్రంగా చెప్పుకునే వారని, కానీ మహాజన్ ఆరోజే చెప్పారని, భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్ వాడే రోజు వస్తుందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.