తెలంగాణ

ఖమ్మం బాటలో వరంగల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 28: ఖమ్మం కార్పొరేషన్‌ను సుందరంగా తీర్చిదిద్దినట్లుగానే వరంగల్ నగరాన్ని కూడా అందంగా తయారు చేసేందుకు ప్రయత్నిస్తామని వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో గత రెండేళ్ళలో జరిగిన అభివృద్ధి, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, జిడబ్ల్యూఎంసి కమిషనర్ శృతిఓజలు ఉన్నతాధికారుల బృందంతో కలసి బుధవారం నగరాన్ని సందర్శించి నగరంలో బ్యూటిపికేషన్ ఇన్ ఖమ్మం కింద చేపట్టిన పనులను పరిశీలించారు. బైపాస్‌రోడ్, ఎన్‌టిఆర్ సర్కిల్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, శ్రీశ్రీ సర్కిల్, 6కోట్ల వ్యయంతో చేపట్టిన లకారంచెరువు ట్యాంక్‌బండ్ అబివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ జిడబ్ల్యూఎంసిలో పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టవల్సి ఉన్నందున ప్రభుత్వ సూచనల మేరకు ఖమ్మంలో జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించినట్లు వారు తెలిపారు. ఖమ్మం స్పూర్తితో వరంగల్‌లో వివిధ సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కొద్ది కాలంలో రాష్ట్రంలో ఎక్కడ చేపట్టని విధంగా ఖమ్మం నగరాన్ని అందంగా తీర్చిదిద్దారని, ఇదే స్పూర్తితో వరంగల్ నగరాన్ని అద్భుతంగా తయారు చేయాలనే ముఖ్యమంత్రి అకాంక్షను నేరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పాపాలాల్, డిప్యూటి మేయర్ బత్తుల మురళీ, కమిషనర్ బొనగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.