తెలంగాణ

విపక్షాల డుమ్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: భూసేకరణ చట్టం 2013కు ఏకపక్షంగా సవరణలు చేయడమేకాకుండా, తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ, కాంగ్రెస్, సిపిఎం, తెలుగుదేశం పార్టీలు గురువారంనాడు శాసనసభ సమావేశాలను బహిష్కరించాయి. కాగా విపక్షాలు సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని, తామెప్పుడూ ప్రతిపక్ష పార్టీలను అవమానించలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. మరోవైపు సిఎల్‌పి నేత జానారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సభ్యులు, టిడిపి, సిపిఎం సభ్యులు స్పీకర్ మధుసూదనాచారిని కలిసి భూసేకరణ చట్టం సవరణ అంశంపై తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై నిరసన తెలియచేశారు. సిపిఎం సభ్యుడు సున్నం రాజయ్య అసెంబ్లీ వెలుపల గాంధీ విగ్రహం బయట ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్లకార్డు
పట్టుకుని దీక్ష చేశారు.
ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మాట్లాడుతూ సభ సజావుగా కొనసాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలన్నారు. తమ ప్రభుత్వం అసెంబ్లీలో మొండిగా వ్యవహరించడం లేదన్నారు. సభను బహిష్కరించడం సరైన పద్ధతి కాదన్నారు. గత ఎన్నికల్లో మొదటిసారిగా బిజెపి సొంత బలంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. అంతకు ముందు 1999 ఎన్నికల్లో బిజెపి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలు ఎప్పుడు ఎవరిని మెచ్చుకుంటారో తెలియదన్నారు. ఒక పార్టీ అధికారంలోకి రావడమనేది మన చేతుల్లో ఉండదని, ప్రజలే నిర్ణేతలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తమకు అధికారం అప్పగించారన్నారు. పోడియం వద్దకు వచ్చి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తే సస్పెండ్ చేయాలని నిర్ణయించామని, సభ హుందాతనం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రగతికి ప్రతిబంధకంగా ఉన్న అంశాలను తొలగించి ప్రజలకు ఉపయోగపడే అంశాలను భూసేకరణ చట్టంలోచేర్చామన్నారు. బుధవారం సభలో భూసేకరణ చట్టం సవరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మల్లన్నసాగర్ ప్రాంతం నుంచి అనేక మంది ఫోన్లు చేసి అభినందించారన్నారు. హరితహారంపై జరుగుతున్న చర్చలో పాల్గొనాలని ఆయన విపక్ష పార్టీలను కోరారు.
స్పీకర్‌తో విపక్ష నేతల భేటి
ఉదయం సిఎల్‌పి నేత జానారెడ్డి, టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్పీకర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అసెంబ్లీలో విపక్షాల గొంతను నొక్కేసే విధంగా వ్యవహరించరాదని జానారెడ్డి కోరారు. స్పీకర్ నిష్పక్షపాతంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతుంటే వారి మైక్‌ను కట్ చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రి విపక్ష పార్టీలను దూషిస్తుంటే స్పీకర్ నవ్వడం మంచిది కాదన్నారు.
తొలుత ఉదయం 10 గంటలకు సభ సమావేశమైన వెంటనే విపక్ష పార్టీలు కూర్చునే బెంచిలు ఖాళీగా కనిపించాయి. దీంతో మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ విపక్ష సభ్యులు సభనుంచి పారిపోయారని, వారు కోరినట్లుగా పెద్ద నోట్ల రద్దు, నరుూమ్, డబుల్ బెడ్ రూం ఇళ్లు తదితర అంశాలపై చర్చకు అనుమతించామన్నారు. 11 రోజుల శాసనసభ సమావేశాల్లో 54 గంటల పాటు చర్చ జరిగిందన్నారు. గతంలో ఇంత హుందగా సభ జరిగిన దాఖలాలు లేవన్నారు. బిజెపి శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సభకు విపక్షాలు హాజరయ్యేందుకు వీలుగా ప్రభుత్వం, స్పీకర్ చొరవ తీసుకోవాలని, విపక్షాల హక్కులను స్పీకర్ రక్షించాలని కోరారు.