తెలంగాణ

పొద్దుమారిన పద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17) లక్ష 25 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. నెల రోజులుగా శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై మూడు అంచలలో జరిపిన సమీక్షలు ముగియడంతో వార్షిక బడ్జెట్‌పై స్పష్టత వచ్చినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ మార్చితో ముగియనున్న ప్రస్తుత బడ్జెట్ రూ.1,15,689.2 కోట్లు ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ గత బడ్జెట్‌కంటే రూ. 10 వేల కోట్లు ఎక్కువగా ఉండబోతుందని అధికార వర్గాల సమాచారం. గత బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయానికంటే ప్రణాళికేతర వ్యయం ఎక్కువగా ఉండగా, అది ఈసారి పరస్పరం మారబోతున్నట్టు ఈ వర్గాల సమాచారం. గత బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం రూ.52,383 కోట్లు ఉండగా, అది ఈసారి బడ్జెట్‌లో రూ.68,000 నుంచి 70,000 కోట్ల మధ్యలో ఉండబోతుందని తెలిసింది. అలాగే ప్రణాళికేతర వ్యయం గత బడ్జెట్‌లో రూ.63,306 కోట్లు ఉండగా, దానిని ఈసారి బడ్జెట్‌లో తగ్గించి రూ.55,000 నుంచి 60,000 కోట్లకు కుదిస్తున్నట్టు ఈ వర్గాల సమాచారం. బడ్జెట్ ప్రతిపాదనలు వాస్తవ పరిస్థితికి అనుగుణంగాకాకుండా మూస పద్ధతిలో రూపొందించే విధానానికి స్వస్తి పలకాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖకు మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు ప్రణాళికా వ్యయంలోనే సరిపడినన్ని నిధులు కేటాయించి, ప్రణాళికేతర వ్యయంలో నిరర్ధక కార్యక్రమాలకు నిధులు కేటాయించే కొత్త పంథాను ఈసారి బడ్జెట్‌లో అనుసరిస్తున్నట్టు ఆర్థికశాఖ వర్గాల సమాచారం.
ప్రణాళిక వ్యయంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు తదితర కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించబోతున్నట్టు సమాచారం. కొత్తగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతోపాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఈసారి బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్లు కేటాయించనున్నట్టు ఇప్పటికే సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించిన అంశం తెలిసిందే. అలాగే వచ్చే ఏడాదికి ఇంటింటికి మంచినీళ్లిచ్చే మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రాష్ట్రంలో ఈ ఏడాది రెండు లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని సిఎం ప్రకటించారు. ఈమేరకు వీటికి ప్రణాళికా వ్యయంలో పెద్దపీట వేసి నిధులు కేటాయించబోతున్నట్టు తెలిసింది. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆశించిన మేరకు నిధులు రాకున్నా, రాష్ట్ర ఆదాయం గత ఏడాది కంటే 15శాతం వృద్ధి రావడంతో ప్రణాళిక వ్యయానికి గతానికంటే ఎక్కువ నిధులు కేటాయించాలని ప్రభుత్వం సూచించినట్టు అధికార వర్గాల సమాచారం.

సంవత్సరం ప్రణాళికేతర వ్యయం ప్రణాళిక వ్యయం కోట్లలో)

2014-15 51,989 48,648

2015-16 63,306 52,383

2016-17 55,000 70,000