తెలంగాణ

8.51 లక్షల దీపం కనెక్షన్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇంతవరకు 8,51,501 దీపం కనెక్షన్లను మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభకు చెప్పారు. అసెంబ్లీలో గురువారం టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, అజ్మీరా రేఖ, కోవా లక్ష్మి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ దీపం పథకం కింద ఇంతవరకు 3,61,716 కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 104 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని భారీ సాగునీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకటరావు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ 7244 ఎకరాల ఆయకట్టుతో 48 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తున్నాయన్నారు. 8126 ఎకరాల ఆయకట్టుతో 22 పథకాలు పాక్షికంగా పనిచేస్తున్నాయని, 3291 ఎకరాల ఆయకట్టు ఉన్న 34 ఎత్తిపోతల పథకాలు నిర్మాణంలో ఉన్నాయని, 6060 ఎకరాల ఆయకట్టు ఉన్న ఐదు కొత్త ఎత్తిపోతల పథకాలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. 9312 ఎకరాల ఆయకట్టుతో ఉన్న 9 ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ లైన్లు ఉన్నాయన్నారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో డెంగ్యూ నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 12 ఆసుపత్రుల్లో ప్లేట్‌లెట్ల యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో దోమల నివారణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామన్నారు.