తెలంగాణ

పిఆర్‌సి బకాయిలు చెల్లిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు వీలైనంత త్వరలో వెసులుబాటును బట్టి, ఆర్థిక పరిస్థితి కుదుటపడిన వెంటనే వేతన సవరణ బకాయిలు చెల్లిస్తామని, ఈ విషయమై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ బదులిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జోక్యం చేసుకుని రాష్ట్ర చరిత్రలో పిఆర్‌సి బకాయిలు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జిపిఎఫ్‌లో సర్దుబాటు చేస్తారా, ఏకమొత్తంలో ఇస్తారా అనే దానిపై డిమాండ్లు రాగా, వెసులుబాటును బట్టి బకాయిలు నగదు రూపంలో చెల్లించాలని చర్చల సమయంలో అభిప్రాయం వ్యక్తమైందన్నారు. ప్రతి నెల 8 వేల కోట్ల రెవెన్యూ రాష్ట్రప్రభుత్వానికి వస్తుందని, ఇందులో 3.5 వేల కోట్లను రుణాల చెల్లింపునకు ఇస్తామన్నారు. ఇటీవల కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలో రూ.997 కోట్లు రావాల్సి ఉండగా, రూ.400 కోట్లు విడుదలయ్యాయన్నారు. వెంటనే ఆర్థిక శాఖ అధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో చర్చించిన వెంటనే నిలిపిన నిధులతో పాటు అదనంగా రూ.500 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసిందన్నారు. అసెంబ్లీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వడమే కాకుండా హోదాను కూడా పెంచుతామన్నారు. అసెంబ్లీ కార్యదర్శి హోదాను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాతో సమానం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల పెద్ద నోట్ల రద్దు తదితర అంశాల వల్ల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడిందన్నారు. దీని ప్రభావం జనవరిలో తెలుస్తుందన్నారు. అంతకు ముందు మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రూ.3450 కోట్ల బకాయిలను ఉద్యోగులకు చెల్లించాల్సి ఉందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను కూడా క్రమబద్ధీకరిస్తామన్నారు. తొమ్మిది నెలల బకాయిలను చెల్లించేందుకు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామన్నారు. బిజెపి ఎమ్మెల్యేలు లక్ష్మణ్,జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, నాలుగు లక్షల మంది ఉద్యోగులు పిఆర్‌సి బకాయిల గురించి ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని, ఒక్కో ఉద్యోగికి రూ.40 వేల నుంచి రూ.1 లక్ష వరకు బకాయిలు వస్తాయన్నారు.