తెలంగాణ

కొండెంగను తరిమేసిన కోతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: కొండెంగను చూడగానే కోతులు భయంతో పారిపోతాయి. కానీ చివరకు కోతులే ఏకమైన కొండెంగను తరిమి వేశాయి. ఇది గురువారం శాసన సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన కొండెంగ- కోతి కథ. హరితహారం పై గురువారం శాసన సభలో లఘు చర్చ జరిగింది. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల కోతులు ఊర్లపై పడుతున్నాయి, ఇంటిపెంకులు కూడా తొలగిస్తున్నాయని పలువురు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ఎమ్మెల్యేలు కోతుల సమస్యలను, చిన్నప్పటి కోతుల అటల గురించి వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ కొండెంగను తరిమిన కోతుల గురించి చెప్పారు. ‘‘సూర్యాపేటలో కోతుల బెడద పెరిగిపోవడంతో కోతులను తరమేందుకు కొండెంగను తీసుకు వచ్చారు. సూర్యాపేట కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతం. రాజకీయ చైతన్యమూ ఎక్కువే, ఆ ప్రభావం కోతులపై కూడా పడింది. మమ్ములను తరిమేందుకు కొండెంగను తీసుకు వస్తారా? అని అనుకున్న కోతులు చివరకు కోతులన్నీ ఏకమైన కొండెంగ మీద దాడి చేశాయి. దాంతో చివరకు కొండెంగ పారిపోయిందని, 80వేల రూపాయలు పెట్టి కొండెంగను తీసుకు వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. కోతులను కొండెంగలే కాదు ముఖ్యమంత్రి ఏమీ చేయలేడు, స్పీకర్ కూడా ఏమీ చేయలేరు. అడవుల్లో మళ్లీ చెట్లు కళకళలాడాలి, ఫల వృక్షాలను పెంచాలి అప్పుడే కోతులు తిరిగి అడవులకు వెళతాయి’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. చివరకు హైదరాబాద్‌లో బిజెపి నాయకుడు ప్రోఫెసర్ శేషగిరిరావుపై కోతులు దాడి చేశాయని, ఆస్పత్రిలో చికిత్స జరిగినట్టు బిజెపి ఎమ్మెల్యే జి కిషన్‌రెడ్డి తెలిపారు. చిన్నప్పుడు కోతులు ఆడించే వాళ్లు గ్రామాల్లోకి వచ్చేవారిని కోతులను చూసి మురిసిపోయేవాళ్లమని, అలాంటి పరిస్థితి కాస్తా ఇప్పుడు భయంకరంగా మారిందని, గ్రామాల్లో కోతులు స్వైర విహారం చేస్తున్నాయని రసమయి బాలకిషన్, హనుమంతు షిండే తదితరులు తెలిపారు. వానలు వెనక్కి రావాలి, కోతులు వెనక్కి పోవాలి అంటే మొక్కలు పెంచడమే మార్గం అని అన్నారు. బిజెపి ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ హైదరాబాద్ నగరంలో పార్కుల్లో మొక్కలు పెంచాలని సూచించారు.