తెలంగాణ

శాంతి భద్రతలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి..అయితే తీవ్రవాదం, ఉగ్రవాదం, సైబర్ నేరాలు వంటి అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు ఆధునిక టెక్నాలజీ వినియోగించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని డిజిపి అనురాగ్ శర్మ వెల్లడించారు. గురువారం నేరాలపై జరిగిన వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమాలపై సిట్ దర్యాప్తు తుది దశకు చేరిందన్నారు. ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించేది లేదంటూ ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ శాసన సభలో కూడా ప్రస్తావించారని, సీఎం ఆదేశాల మేరకు నరుూం కేసులో ఎవరినీ వదిలేదని డిజిపి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నరుూంపై 175 కేసులు నమోదయ్యాయని, 124 మందిని అరెస్టు చేశామన్నారు. వీరిలో నలుగురిపై పిడి యాక్టు పెట్టనున్నట్టు డిజిపి వెల్లడించారు.
అదేవిధంగా కరుడుగట్టిన మోస్ట్‌వాంటెడ్ అయూబ్‌పై కూడా పిడియాక్టు పెడతామన్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత నోట్ల మార్పిడికి సంబంధించి 29 కేసులు నమోదయ్యాయని, రూ. 3 కోట్ల 68 లక్షల, 64 వేల, 90 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని డిజిపి తెలిపారు. టి-ఎమ్సెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో 53 మందిని అరెస్టు చేశామని, ఈ కేసును సిట్ నిరంతర దర్యాప్తు కొనసాగుతుందన్నారు. వారంలోగా ఈ కేసు పూర్తి దర్యాప్తుతోపాటు మూసివేయబడుతుందని డిజిపి తెలిపారు. తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం లేదని, చత్తీస్‌గఢ్, మహరాష్ట్ర పోలీస్ జాయింట్ ఆపరేషన్‌లో రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయన్నారు. తెలంగాణలో మావోయిస్టుల రిక్రూట్‌మెంట్ జరగడం లేదు, మూడు రాష్ట్రాల్లో కలిపి మావోయిస్టులకు కేవలం 92 మంది కేడర్ మాత్రమే మిగిలి ఉందని, చత్తీస్‌గఢ్, మహరాష్ట్ర సరిహద్దుల నుంచి మావోయిస్టులను తెలంగాణలోకి అడుగుపెట్టనివ్వబోమన్నారు. ప్రజాగాయకురాలు విమలక్క కార్యాలయంలో ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్న విషయంపై విలేకరుల ప్రశ్నకు ఆయన బదులిస్తూ, ఆయుధాలు లభించినట్టు తమ వద్ద ఆధారాలు లేవని, ఆ విషయం జిల్లా పోలీసులు తెలుపుతారని దాటవేశారు. అదేవిధంగా జెఎసి నేత కోదండరాం ధర్నాకు అనుమతివ్వకపోవడంపై స్పందిస్తూ, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని కోదండరాం ధర్నాకు అనుమతివ్వలేదని డిజిపి అనురాగ్ శర్మ స్పష్టం చేశారు.

చిత్రం..నేరాలపై జరిగిన వార్షిక సమావేశంలో మాట్లాడుతున్న డిజిపి అనురాగ్‌శర్మ