ఆంధ్రప్రదేశ్‌

నేటినుంచి ఆరోగ్యరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 31: రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమాను కల్పించే దిశలో ప్రభుత్వం ముందడుగు వేసింది. జనవరి నుంచి ఆరోగ్య రక్ష పథకం కింద కొత్త పథకం రాష్ట్రంలో అమలు చేయనునున్నారు. జన్మభూమి కార్యక్రమం ప్రారంభానికి ముందు కృతజ్ఞతలు తెలపాలని తీర్మానించారు. చుక్కల భూముల సమస్య పరిష్కారానికి చట్టం, గుజరాత్ తరహాలో భూసేకరణ చట్టానికి సవరణలు వంటి నిర్ణయాలు రాష్ట్ర మంత్రి వర్గం శనివారం తీసుకుంది. వెలగపూడి సచివాలయంలో శనివారం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్లాక్ -1లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బిపిఎల్ కాని కుటుంబాలకు వర్తించేలా ఈ ఆరోగ్య రక్ష పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఒక్కరికి నెలకు 100 రూపాయలు చొప్పున కడితే రెండు లక్షల రూపాయల మేరకు వైద్య సేవలు పొందే వీలు ఉంటుందన్నారు. దీని వల్ల వైద్యానికి భరోసా లభిస్తుందన్నారు. జనవరి నుంచి ఫిబ్రవరి వరకూ రిజిస్ట్రేషన్ చేస్తారని, మార్చి నుంచి పథకం అమల్లోకి వస్తుందన్నారు. దేశంలోనే ఈరకం పథకం మొదటిదన్నారు. చాలాకాలంగా ఉన్న చుక్కల భూముల సమస్య పరిష్కారానికి చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. వీటిలో చాలావరకూ ప్రైవేట్ భూములైనప్పటికీ, రికార్డుల్లో స్పష్టత లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భూ సేకరణకు సంబంధించి 2013 చట్టానికి సవరణ చేస్తున్నట్లు తెలిపారు. గుజరాత్ తరహాలో ఆ చట్టానికి సవరణలు చేసేందుకు నిర్ణయించామన్నారు. ఇప్పటికే భూసేకరణకు సంబంధించి రాష్ట్రంలో ఇబ్బందులు లేవని, రైతులు
సహకరిస్తున్నారన్నారు. భూసేకరణ చట్టసవరణ ద్వారా చిన్నచిన్న ఇబ్బందులను కూడా తొలగించే వీలు కలుగుతుందన్నారు. ఎక్కడాలేని విధంగా రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తున్నారన్న నమ్మకం రైతుల్లో కలిగిందన్నారు. వంశధార ఆర్‌ఆర్ ప్యాకేజీకి 450 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. ఎనిమిదేళ్లుగా పరిష్కారం కాని పోలవరం కుడి కాలువ సమస్య పరిష్కరించామని గుర్తు చేశారు. గండికోట రిజర్వాయరుకు సంబంధించి 14 గ్రామాల పునరావాసానికి 480 కోట్ల రూపాయలు చెల్లించేందుకు నిర్ణయించామన్నారు. కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న భూసేకరణను భూ సమీకరణ ద్వారా సేకరించామన్నారు. అమరావతి రాజధాని, కాకినాడ ఎస్‌ఇజెడ్, భోగాపురం విమానాశ్రయం, మచిలీపట్నం ఓడరేవుల కోసం భూసమీకరణ చేసి దేశంలో ఒక నమూనాను తయారు చేశామన్నారు. ప్రభుత్వానికి ఇస్తే లాభం వస్తుందన్న నమ్మకం కలిగేలా ప్రభుత్వం కూడా ఎక్కువగానే నష్టపరిహారం ఇస్తున్నదని తెలిపారు.
కృతజ్ఞతలు చెప్పండి
జన్మభూమి కార్యక్రమం ప్రారంభంలో కృతజ్ఞతలు తెలిపే సంపద్రాయానికి శ్రీకారం చుట్టనున్నట్లు సిఎం తెలిపారు. తాము పొందిన మేలుకు కృతజ్ఞతలు తెలపడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పెంపొందుతుందన్నారు. జన్మభూమి సభకు ముందు ప్రకృతికి, తల్లితండ్రులకు, జ్ఞానదాతలకు, సమాజానికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా శివారు భూములకు గోదావరి నీళ్లు ఇచ్చి పంటలను కాపాడుకున్నామన్నారు. దీనికి కృతజ్ఞత తెలియచేసేందుకు ఆ పంటతో పొంగలిని, అటుకులను తీసుకువచ్చి తనకు ఇచ్చారని, ఇది తన మనసుకు హత్తుకుందన్నారు.
మురికివాడల అభివృద్ధికి చర్యలు
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మురికివాడలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించామన్నారు. ఆయా మురికివాడల ప్రజలు ముందుకు వస్తే పిపిపి విధానంలో పునర్నిస్తామన్నారు. తిరుపతిలో, గుంటూరులో ఇదే పద్ధతిలో కాలనీలను అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీకాకుళం ఎచ్చర్లలో ఐఐఐటి ఏర్పాటుకు 45 ఎకరాల స్థలం కేటాయించనున్నట్లు తెలిపారు.

చిత్రం.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు