తెలంగాణ

సమష్టిగా సాధిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం వచ్చే మేలోగా పూర్తి చేసి ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల గోత్రనామంతో సామూహిక గృహ ప్రవేశానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని సిఎం కె చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. స్వయం శాసిత, స్వయం సంవృద్ధి, స్వయం పాలిత నినాదంతో ప్రజలంతా సమష్టిగావుంటే సాధించలేనిదంటూ ఉండదని పిలుపునిచ్చారు. మంచి పనిని చెడగొట్టేందుకు కొందరుంటారని, అలాంటి వారిలో మార్పుతెచ్చి గ్రామాలను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లోని అభివృద్ధి పనులను సిఎం స్వయంగా పర్యవేక్షించారు. ముందుగా ఎర్రవల్లి శివారులోని ఎర్రకుంట మరమ్మతు పనులను పర్యవేక్షించి, అనంతరం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం గ్రామ కూడలివద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చూసిన వారంతా ఈర్ష్యపడుతున్నారని, హైదరాబాద్‌లోని విల్లాలను తలపించేలా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. గోదావరి జలాలను గజ్వేల్‌లోని కోమటిబండకు చేరవేసి అక్కడి నుంచి నేరుగా వాటర్ ట్యాంకులకు, అక్కడి నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్లపై నిర్మిస్తున్న ట్యాంకులకు చేరవేస్తామని, 24 గంటలూ నీటి కొరత లేకుండా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి, సిసి రోడ్లు, వర్షం నీరుపోయేలా ఉపరితల మురికి కాల్వలను నిర్మించి ప్రతి ఇంటిముందు మొక్కలు నాటిస్తామన్నారు. కొద్దిరోజుల క్రితం చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమానికి గ్రామస్తులంతా సంపూర్ణ సహకారం అందించడం వల్లే విజయవంతంగా ముందుకు వెళుతున్నామని సంతృప్తి వ్యక్తం చేశారు. తాను కూడా ఒక కార్యకర్తగా బాధ్యతతో దత్తత తీసుకున్న రెండు గ్రామాలను పూర్తిస్థాయి అభివృద్ధి సాధించి తెలంగాణ రాష్ట్రంతోపాటు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిపేలా కలిసికట్టుగా పనిచేద్దామని పునరుద్ఘాటించారు. ఆడ బిడ్డలు నీటి బిందెతో బయట కనిపిస్తే నైతిక బాధ్యతవహించి సర్పంచ్, ఎంపిటిసిలు రాజీనామా చేయాలన్నారు. ప్రజల సంఘటితమంటే ఏమిటో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూర్‌లో కూడా ఇళ్లను కూల్చివేసి నిర్మాణం చేపట్టినా ప్రజల్లో సమిష్టి లోపించగా అధికారులు కూడా విఫలమయ్యారన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి సృష్టించబోతున్నామని, రెండు గ్రామాల్లో మొత్తం 2800 ఎకరాల సాగుభూమిని అధికారులు గుర్తించారన్నారు. 200 ఎంసిఎఫ్‌టి సామర్థ్యంతో కూడేరువాగుపై ఐదు చెక్‌డ్యాంలు నిర్మించి గోదావరి జలాలతో నింపుతామని, తద్వారా సాలినా మూడు పంటలు సాగు చేసుకునే అవకాశం రెండేళ్లలో రెండు గ్రామాల ప్రజలకు రానున్నదన్నారు. 2800 ఎకరాల భూమిని 200 ఎకరాల చొప్పున జోన్లుగా విభజించి డ్రిప్ విధానంతో పంటలను సాగు చేస్తామన్నారు. గ్రామాల్లో భూమిలేని కుటుంబాలకు చెందిన యువకులకు ఆధునిక సాగుపై శిక్షణ ఇప్పించి, ఆ యువకులే పంటలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోబోతున్నామని వెల్లడించారు. కుటుంబ పెత్తనం మహిళ చేతిలో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ తులతూగుతుందని, ఇందుకు అంకాపూర్ ఆదర్శమని, మన మహిళలు కూడా అదే తరహాలో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్ రాస్, సంయుక్త కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, విడిసి చైర్మన్ కిష్టారెడ్డి, జెడ్పీటిసి రాంచంద్రం, సర్పంచులు భాగ్య బాల్‌రాజ్, బాల్‌రెడ్డి, ఎంపిటిసిలు భాగ్యమ్మ, మల్లమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
chitram...
ఎర్రవల్లి గ్రామసభలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్