తెలంగాణ

టి.హబ్‌లో జిఎస్‌ఇఎ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: పారిశ్రామిక ఔత్సాహికతను ప్రదర్శించే విద్యార్థులకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టే ఔత్సాహిక పురస్కారాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు టి హబ్ సిఇఓ జయ కృష్ణన్ చెప్పారు. గ్లోబల్ స్టూడెంట్స్ ఔత్సాహిక పురస్కారాల సంస్థ ఈ అవార్డులను ఇస్తుంది. తొలి దశ స్క్రూటినీ ఫిబ్రవరి 4న జరుగుతుందని, అందులో విజేతలకు జాతీయ స్థాయి పోటీ గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో మార్చి 10న జరుగుతుందని ఎంట్రిప్రిన్యూర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు వంశీ మద్దిపట్ల తెలిపారు. అక్కడ కూడా విజేతగా నిలిచిన వారు అంతర్జాతీయ పోటీలకు అర్హులవుతారని, వారికి 4 లక్షల డాలర్ల నగదు పురస్కారం గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.