తెలంగాణ

బండారం తెలుస్తుందనే సిట్ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 30: టిఆర్‌ఎస్ నేతల బండారం బయటపడుతుందనే నరుూం కేసును ముఖ్యమంత్రి ఆధీనంలో ఉండే సిట్‌చే విచారణ జరిపిస్తున్నారని కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి విమర్శించారు. కేసు విచారణను తన గుప్పిట్లో పెట్టుకునేందుకే సిట్‌చే విచారణ జరిపిస్తానని ముఖ్యమంత్రి అంటున్నారని అన్నారు. నరుూం ప్రధాన అనుచరుడి సంగతేమిటి,..? నరుూంతో సన్నిహితంగా మెలిగిన రాజకీయ నేతలు, ఐ ఏ ఎస్, ఐపీ ఎస్‌ల సంగతి కూడా తేల్చాల్సి ఉందని అన్నారు. 2015లో నరుూం మేనకోడలు పెళ్లి విందుకు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఆ విడియోలు ఎక్కడికి పోయాయోప్రజలకు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. నరరూప రాక్షసుడిగా పేరొందిన నరుూంతో సంబందాలు ఉన్న వారిని కాపాడేందుకు యత్నించడం సరికాదన్నారు. టిఆర్‌ఎస్ నేతలు, పోలీసులను కాపాడే ప్రయత్నాన్ని వెంటనే మానుకోవాలని సూచించారు.
సభలోనూ నిరంకుశమే : అరుణ
అన్ని పక్షాల వారికి సమాన అవకాశాలు ఇవ్వాల్సిన సభలో కూడా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని డి.కె. అరుణ ఆరోపించారు. ప్రజల సమస్యలపై చర్చించే అవకాశం ఇవ్వడం లేదు. స్పీకర్ ఎకపక్ష దోరణితో ప్రతిపక్ష సభ్యులకు అవకాశం లేకుండా పోతుందని వాపోయారు. చివరకు బి ఎసిలో ప్రధాన పక్షం ఇచ్చిన అంశాలను కూడా చర్చించేందుకు సమయం ఇవ్వడం లేదు. ప్రశ్నల్లో కూడా ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తనకు మైక్ ఇస్తే సిఎం బండారం బయటపెట్టేవాన్ని అన్నారు.
ఎండబెడుతున్నారు : వంశీచందర్ రెడ్డి
పార్టీలు మారిన వారి కోసం మాకు నీళ్లు ఇవ్వకుండా ఎండబెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తికి 62వేల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పి మాట తప్పిందని విమర్శించారు. గుత్తా సుఖేందర్ అడగ్గానే ఆయకట్టు ప్రజలను వదిలి ఆయకట్టులేని నల్లగొండ ప్రజలకు నీటిని దోచుకుపోతున్నారన్నారు. జూపల్లికి కృష్ణారావుకు చిత్తశుద్ది ఉంటే మాకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు
నకిలీ కారంపై చర్చించాలి : రాజయ్య
ఖమ్మం జిల్లాలో నకిలీ కారం విక్రయిస్తున్న మాఫియాపై సభలో చర్చించాలని సిపిఎం సభ్యుడు సున్నం రాజయ్య కోరారు. ఇప్పటికే 100 కోట్ల వ్యాపారం జరిగిందని వెంటనే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
విపక్షానికే ఎక్కువ సమయమిచ్చాం..
అధికార పక్షం కంటే ప్రతిపక్షానికే సభలో ఎక్కువ సమయం కేటాయించజరిగిందని టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా జరిగిన పనుల వల్ల 45 వేల చెరువులు నిండాయని తెలిపారు.