తెలంగాణ

ఖరీఫ్ నాటికి నీరందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, డిసెంబర్ 30: కల్వకుర్తి ఎత్తిపోత్తల పథకం ద్వారా కల్వకుర్తి నియోజక వర్గంలోని ప్రతి ఎకరా తడుస్తుందని, వచ్చే ఖరీఫ్ కల్లా కె ఎల్ ఐ ద్వారా సాగునీరు అందిస్తామని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం స్థానిక ఉన్నత పాఠశాల అవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో మాట్లాడుతు కె ఎల్ ఐ ద్వారా వచ్చే ఖరీఫ్ కల్లా సాగునీరు అందిస్తామని, గత పాలకుల నిర్లక్ష్యంతోనే కె ఎల్ ఐ నీరుగారిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుదల, లక్ష్యంతో బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్నారని, గత ఆంధ్ర పాలకుల పాలనలో14 సంవత్సరాలకు 12 కోట్ల రూపాయల నిధులను మాత్రమే మంజూరు చేశారని, ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికలల్లో ఓట్లు అడగమని సభలలోనే సి ఎం కెసి ఆర్ ప్రజలకు హామి ఇస్తున్నారని, సాగునీరు ఇవ్వకుంటే ఓట్లు అడగమని చేప్పే దైర్యమున్న ముఖ్యమంత్రి కెసి ఆర్ అని ఆయన తెలిపారు. పదవులు శాశ్వతం కాదని ప్రత్యేక తెలంగాణ కోసం అనేకమార్లు పదవులకు రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణ సాధించారని, గత పాలకుల పాలనలో నీటి పారుదల శాఖ మంత్రులు ప్రాజెక్ట్‌ల వైపు ఒక్క సారి కూడా చూడలేదని, టి ఆర్ ఎస్ ప్రభుత్వంలో మంత్రి హరిష్‌రావు 20 సార్లు పరిశీలన చేశారని మంత్రి పేర్కొన్నారు. బహిరంగ సభకు ముందు కె ఎల్ ఐ కాల్వలను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, టి ఆర్ ఎస్ కల్వకుర్తి మాజీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాలాజీసింగ్ తో కలిసి పరిశీలించారు. అదేవిధంగా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ మంత్రి రాములు, మాజీ ఎంపి మంద జగన్నాధం, మాజీ ఎమ్మెల్యే సభలో కల్వకుర్తి , అమనగల్లు మాడ్గుల, తలకొండపల్లి, వెల్దండ జడ్పీటిసిలు, ఎంపిపి లు, నగర పంచాయితీ కౌన్సిలర్లు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..కెఎల్‌ఐ పనులను పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి