తెలంగాణ

ఐకెపి, ఎన్‌ఆర్‌జిఎస్ ఉద్యోగులకు.. తెలంగాణలోనే అధిక వేతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: గ్రామీణాభివృద్ధి శాఖలో సెర్ప్ విభాగం, జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులకు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్టమ్రేనని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. శాసనసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల వ్యవధిలో పాలకపక్షం సభ్యుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టిడిపి సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య అడిగిన ప్రశ్నలకు మంత్రి కృష్ణారావు సమాధానం చెబుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెర్ప్, ఎన్‌ఆర్‌జిఎస్ ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచామన్నారు. విలేజ్ బుక్ కీపర్స్‌ను పొదుపు సంఘాలు నియమించుకోవడంతో వారికి వేతనాలు పెంచడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. మహిళ సాధికారత పెంచేందుకు రూ.2548 కోట్ల రుణాన్ని మహిళా సంఘాలకు ఇవ్వడంతో పాటు, స్ర్తినిధి బ్యాంక్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహకారం అందిస్తున్నామన్నారు. సెర్ప్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ల నెలసరి వేతనాన్ని రూ.6290 నుంచి రూ.10 వేలకు పెంచామన్నారు. మండల సమాఖ్య క్లస్టర్ కోఆర్డినేటర్లకు నెలకు రూ. 12 వేలు చెల్లిస్తున్నామన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఉద్యోగులకు పెంచిన వేతనాల వల్ల ప్రభుత్వంపై రూ.4.35 కోట్ల భారం పడిందని మంత్రి కృష్ణారావు వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలు 13 ఉండగా ప్రైవేట్ కాలేజీలు 11 ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన అన్ని జిల్లాల్లోనూ కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. కొత్తగా మరో నాలుగు వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. గేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చుట్టుపక్కల ఉన్న మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని ప్రాంతాలకు మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగు పరుచడానికి రూ.1700 కోట్లు హడ్కో రుణం ఇవ్వగా, రెండు వందల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ప్రశ్నోత్తరాల వ్యవధిలో ఎంఐఎం, బిజెపి, టిఆర్‌ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి కెటిఆర్ చెబుతూ, జిహెచ్‌ఎంసి వెలుపల, అవుటర్ రింగ్ రోడ్‌కు లోపల ఉన్న గ్రామాలకు ఫిబ్రవరి 2018 నాటికి ప్రతి రోజు మంచినీటిని సరఫరా చేస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు.