తెలంగాణ

గోకుల్ బ్యాంక్ చైర్మన్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: సికిందరాబాద్‌లోని గోకుల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చీమల జగదీష్ యాదవ్‌ను శనివారం సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ-సేవ లావాదేవీల్లో రూ.3.5 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని అభియోగాలపై జగదీశ్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 2004లో గోకుల్ అర్బన్ బ్యాంక్‌ను మోండా మార్కెట్‌లో ఏర్పాటు చేశారు. కాగా, వ్యాపారులు తమ లావాదేవీలను సులువుగా జరుపుకునేందుకు ఈ-సేవను స్థాపించారు. బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ-సేవను ఈఎస్‌డి శాఖ అనుమతితో వ్యాపారులకు అదనపు చార్జీలు చెల్లించకుండా లావాదేవీలు జరుపుకోవచ్చని ఈ సహకార బ్యాంక్ నిర్ణయించింది. దీంతో అనేక మంది వ్యాపారులు కరెంట్ అకౌంట్‌తో తమ లాదేవీలు సాగించారు. కాగా 18 డిసెంబర్ 2013 నుంచి 5 అక్టోబర్ 2015 నాటికి వ్యాపారులు రూ. 9,13,04,842లు కరెంట్ ఎక్కౌంట్ ద్వారా డిపాజిట్ చేశారు. వ్యాపారుల లావాదేవీలు కొనసాగుతుండగా ఈఎస్‌డి విభాగం తనిఖీలు చేయకుండా సదరు ఖాతాను పరిశీలించలేదు. దీనిని ఆసరగా చేసుకున్న బ్యాంక్ చైర్మన్ జగదీశ్ రూ. 3,06,24,676లు దుర్వినియోగం చేశారని ఈ-సేవ సిబ్బంది ఫిర్యాదు చేసింది. ఖాతాదారులకు చెల్లింపుల్లో బ్యాంక్ విఫలమైనందున అతణ్ని అరెస్టు చేసినట్టు సిసిఎస్, డిడి విభాగం డిసిపి కోటి రెడ్డి తెలిపారు. ఈ కేసు ఏసిపి ఎం శ్రీనివాసులు దర్యాప్తు జరుపుతున్నారు.