తెలంగాణ

జైల్లో పెట్టినా జై తెలంగాణే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, డిసెంబర్ 31: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరుబాట పట్టిన సమయంలో జైల్లో పెట్టిన కూడా జై తెలంగాణ నినాదాన్ని మాత్రం మరిచిపోలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అమరవీరుల త్యాగాలు, వేలాది మంది పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. శనివారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో పెద్దపల్లి, సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం హరితహారంలో ముందుండి ప్రభు త్వం నుంచి ప్రశంసలు అందుకుందని, ఈ ఘనత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికే దక్కిందన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ ఉందన్నారు. నేను మాటిస్తే శిలాశాసనమేనని, పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానని అన్నారు. రైతులు, దడువాయిలు, కూలీలు ఇలా అందరితో మంచిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని కొత్త చైర్మన్లను కోరారు. దళారుల చేతికి వెళ్లకుండా వ్యవసాయ మార్కెట్‌ను అభివృద్ది చేయాలని మంత్రి సూచించారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రాజెక్టులతోనే తెలంగాణ సస్యశ్యామలం కానుందన్నారు. 450టిఎంసీల నీటి తో 45లక్షల ఎకరాలకు నీరందిస్తే బంగారు తెలంగాణ సాదించుకోవచ్చని అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్దే ద్యేయమని అన్నారు. హరితహారంలో భాగంగా సర్పంచులు, ఎంపిటీసీలు, జెడ్పిటీసీలు ఇంటింటికి చెట్లను పంపిణీ చేసి అభివృద్దికి కృషి చేశారని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని గ్రామాలన్నింటిని స్వచ్చ గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు. పెద్దపల్లి జిల్లాలో రింగ్ రోడ్డు, తారురోడ్లు, రోడ్ల వెడల్పు లాంటి కార్యక్రమాలతో జిల్లాను అభివృద్ది వైపు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రిని కోరారు.