తెలంగాణ

కారు, బైక్ ఢీ.. ముగ్గురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నకోడూరు, డిసెంబర్ 31: బైకును కారు ఢీకొని ముగ్గురు మరణించిన సంఘటన సిద్దిపేట మండలం చిన్నకోడూరు మండల పరిధిలోని మందపల్లి స్టేజి రాజీవ్ రహదారిపై శనివారం జరిగింది. సిద్దిపేట టూటౌన్ సిఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్‌కు చెందిన మెర్గుశ్రీకాంత్ (22), జగిత్యాల జిల్లా దర్మపురి మండలం పెద్దనక్కలపేట గ్రామానికి చెందిన బరిగె సురేష్ (22), పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తెలుకుంట గ్రామానికి చెందిన తొర్తిసంపత్ (19)లు కొద్దిరోజులుగా మందపల్లి మధిర గ్రామమైన పిట్టలవాడలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూంల నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నారు. శనివారం సిద్దిపేట నుండి పిట్టలవాడకు వెళ్తున్న తరుణంలో మందపల్లి స్టేజి వద్ద రాజీవ్ రహదారిపై బైకుపై రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని కారు వీరిని డీకొట్టింది. శ్రీకాంత్, సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా, సంపత్ సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
మధ్యాహ్న భోజనానికి
స్టీమ్డ్ సన్న బియ్యం!
అక్రమాల నివారణకు ప్రభుత్వ నిర్ణయం
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, డిసెంబర్ 31: మధ్యాహ్న భోజన పథకం అమలు నిమిత్తం పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్న సన్న బియ్యం నాసిరకంగా ఉండటంతో వాటికి బదులుగా పౌర సరఫరాల సంస్థ స్టీమ్డ్ సన్న బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇంతకుముందు సరఫరా అవుతున్న సన్న బియ్యంతో వండిన అన్నం ముద్దగా తయారవుతుండటమే ఇందుకు కారణం. అంతే కాకుండా కొంతమంది అక్రమార్కులు సన్న బియాన్ని దారిమళ్లించి నాసిరకం బియ్యంతో విద్యార్థులకు భోజనం పెడుతున్నట్లు కూడా ఆరోపణలు వస్తుండటంతో సమస్యలకు చెక్ పెట్టేందుకు పౌరసరఫరాల శాఖ ఈ చర్య చేపట్టింది. కస్టమ్ మిల్లింగ్‌తో మధ్యాహ్న భోజనం కోసం తీసుకుంటున్న బియ్యాన్ని మిల్లుల్లోనే స్టీమ్ చేసి ఆ తర్వాత గట్టి పరుస్తున్నారు. ఈ బియ్యంతో వండిన భోజనం నాణ్యంగా ఉంటోంది. దీంతో ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఈ బియ్యానే్న సరఫరా చేసి, మార్చి నుంచి మళ్లీ సాధారణ సన్నబియ్యానే్న అందజేయనున్నారు. పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరాచేసే స్టీమ్డ్ సన్న బియ్యం సంచిపై మధ్యాహ్న భోజనం, స్టీమ్ బియ్యం అని రాసి ఉండి ప్రత్యేక ప్యాకింగ్‌తో ఉంటుంది. ఈ బియ్యాన్ని దారి మళ్లించినా వెంటనే తెలుసుకుని బాధ్యులపై చర్యలు చేపట్టేందుకు వీలుగా ఇలా చేస్తున్నారు.
‘ఆసరా’ వెతల నుంచి
వృద్ధులకు విముక్తి