తెలంగాణ

గోకుల్ బ్యాంక్ నిధుల మిస్సింగ్‌పై కీలక మలుపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: సికిందరాబాద్‌లోని గోకుల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నిధుల మిస్సింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. బ్యాంకులో దాదాపు రూ. 3.5 కోట్లకుపైగా నిధులు దుర్వినియోగమయ్యాయని అభియోగంపై బ్యాంక్ చైర్మన్ చీమల జగదీష్ యాదవ్‌ను శనివారం సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా బ్యాంక్‌లో కనిపించని మూడున్నర కోట్ల నిధులపై పోలీసులు ఆరా తీస్తుండగా, గ్యాంగ్‌స్టర్ నరుూం తమను బెదిరించాడని, బ్యాంకును తమకు ఇవ్వాలంటూ నరుూం అనుచరులు ఒత్తిడి చేశారని, బ్యాంక్ చైర్మన్ భార్య భవాని సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్బన్ బ్యాంక్‌లో బినామి పేర్లపై గ్యాంగ్‌స్టర్ సుమారు మూడున్నర కోట్లు డిపాజిట్లు చేసి, రూ. 5 కోట్లు డిమాండ్ చేశాడని ఆమె తెలిపింది. గ్యాంగ్‌స్టర్ నరుూం, అతని అనుచరులు, బ్యాంక్ చైర్మన్ జగదీశ్ తలకు రూ. 5 కోట్లు వెల కట్టడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన అతను నరుూం ముఠాకు బినామీ పేర్లపై మూడున్నర కోట్లు ఇచ్చినట్టు ఆమె తెలిపారు. ఫిబ్రవరి 2004లో గోకుల్ అర్బన్ బ్యాంక్ మోండా మార్కెట్‌లో స్థాపించబడిందని, నాటి నుంచి చైర్మన్ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆమె స్పష్టం చేశారు. 18 డిసెంబర్ 2013 నుంచి 5 అక్టోబర్ 2015 నాటికి వ్యాపారులు రూ. 9,13,04,842లు కరెంట్ ఎక్కౌంట్ ద్వారా డిపాజిట్ చేశారు. వ్యాపారుల లావాదేవీలు కొనసాగుతుండగా ఈఎస్‌డి విభాగం తనిఖీలు చేయకపోవడంతో ఇంతకాలం ఈ విషయం బయటకు పొక్కలేదు. దీనిని ఆసరగా చేసుకున్న బ్యాంక్ చైర్మన్ జగదీశ్ రూ. 3,06,24,676లు దుర్వినియోగం చేశారని సిబ్బంది ఫిర్యాదు చేయడం సమంజసం కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.