తెలంగాణ

బాగా పనిచేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ ప్రభుత్వం 31నెలల పాలనా కాలంలో అద్భుతమైన ప్రగతి సాధించిందని, విద్యుత్ సంక్షోభం నుంచి వెలుగుల వైపు పయనం సాగించిందని గవర్నర్ నరసింహాన్ తెలంగాణ ప్రభుత్వ పనితీరును, ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో అభివృద్ధి పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంలో సాధించిన పురోగతి ఆశ్చర్యం కలిగిస్తోందని, ఇది గొప్ప పురోగతి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకటే అనే వాదనను తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ నాయకత్వంలో తిప్పికొట్టినట్టు చెప్పారు.
అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ కెసిఆర్ విద్యుత్ కోతలు లేకుండా చేశారని అన్నారు. తమ సోమా జ్యోతిర్గమయి అనే పురాతన నానుడిని కెసిఆర్ గుర్తు చేశారని, చీకటి నుంచి వెలుగులకు తీసుకు వచ్చారని అన్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తున్నారని గవర్నర్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు, అధికారులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించిందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అందరి సలహాలు తీసుకుంటారని, ఇంత విస్తృతంగా సలహాలు తీసుకునే మరో ముఖ్యమంత్రిని తాను చూడలేదని అన్నారు. తెలంగాణ దేశంలోనే నంబవన్ రాష్ట్రంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. 2017లో కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ మరింతగా పురోగమిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్ణయించుకుని, వాటి అమలుకు సమగ్ర ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళుతున్నారని, 31నెలల్లో మంచి ప్రగతి సాధించారని అన్నారు.
ప్రతి ఇంటికి మంచినీటిని అందించాలనే బృహత్ లక్ష్యంతో మిషన్ భగీరథ చేపట్టడం, పనులు వేగంగా జరుపుతుండడం అభినందనీయమని అన్నారు. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ పథకం ఈ సంవత్సరం చివరికల్లా పూర్తి అవుతుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం వంటి పథకాల నుంచి త్వరలోనే ఫలాలు ఆశిస్తున్నట్టు, త్వరలోనే ఇవి పూర్తవుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఐటిలో మేటి:కెటిఆర్‌కు అభినందనలు
ఐటి రంగంలో తెలంగాణ పురోగతిని గవర్నర్ అభినందించారు. రాష్ట్రాన్ని ఐటి రంగంలో మొదటి స్థానంలో నిలిపారని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావును గవర్నర్ ప్రశంసించారు. ఇన్ఫర్మేషన్ రంగాన్ని అందిరికీ చేరువు చేస్తున్నారని అన్నారు. టి- హబ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోందని చెప్పారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అంకిత భావంతో తెలంగాణ పోలీసులు పని చేస్తున్నారని అభినందించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం బాగుందని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలబడడం అభినందనీయమని అన్నారు. కెసిఆర్ పాలనలో టీమ్ స్పిరిట్ నింపారని, సమన్వయంతో ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.

చిత్రం.. గవర్నర్ నరసింహన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్