తెలంగాణ

అర్చకుల కష్టాలు తీరుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1:తెలంగాణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని 650 దేవాలయాల్లో పని చేస్తున్న సుమారు 5800 మంది అర్చక, ఇతర సిబ్బంది వేతనాల చెల్లింపులపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం సమీక్ష జరిపారు. వీరి వేతనాల విషయంలో ఒక సమగ్రత తెచ్చి అర్చకులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, సిఎంఓ అధికారి భూపాల్‌రెడ్డి, అర్చక ఉద్యోగ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సంక్రాంతితో అర్చకుల కష్టాలు తొలగిపోవాలని, ఆ దిశగా తగు చర్యలు తీసుకునేందుకు చేపట్టవలసిన కార్యక్రమం, విధి విధానాలు రూపొందించేందుకు ముఖ్యమంత్రి ఒక కమిటీ వేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, కమిషనర్ శివశంకర్, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, లా సెక్రటరీ సంతోష్‌రెడ్డి, అర్చకప్రతినిధులు గంగు ఉపేంద్ర శర్మ, గంగు భానుమూర్తి, ఇతర సిబ్బంది తరఫున మోహన్, గంగారెడ్డిలు ఉన్నారు. అర్చకులకు, ఇతర సిబ్బందికి వేతనాలు నేరుగా వారి అకౌంట్‌లో పడే విధంగా చెల్లించేందుకు ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ ఏర్పాటు చేసే విషయం కమిటీ పరిశీలిస్తుంది. ఒకే పనికి ఒకే వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అర్చకులు, ఇతర సిబ్బంది జీతాల చెల్లింపు, ఉద్యోగుల రెగ్యులరైజేషన్, రోస్టర్ సమస్యలు తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ఒకటి రెండు రోజుల్లో నివేదిక తనకు అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేవాదాయ భూములు, మాన్యాలు, గత ప్రభుత్వ హయాంలో వారి మితిమీరిన జోక్యం వల్ల అవినీతికి ఆలవాలమయ్యాయని, అధ్యాత్మిక వ్యవస్థ దెబ్బతిన్నదని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ బాగుపడాలి, దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కౌలు పేరు మీద కబ్జాల పాలు కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏ ఆలయం కింద ఎన్ని భూములు ఉన్నాయో లెక్క తేల్చాలని చెప్పారు. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన పద్ధతిలోనే అర్చకులను, ఇతర సిబ్బందిని రెగ్యులర్ చేసే విషయంలో పరిశీలించాలని ఆదేశించారు. ఆధ్యాత్మిక భావన ఉన్నవారినే దేవాలయా ట్రస్ట్ బోర్డుకు నియమించాలని చెప్పారు.
ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ అర్చక వెల్ఫేర్ ఫండ్ చైర్మన్ ఐవిఆర్ కృష్ణారావు అభినందిం చారు. తెలంగాణ ముఖ్యమంత్రి తీసు కున్న నిర్ణయంతో తెలంగాణలో ఆల యాలు, అర్చకుల పరిస్థితి మెరు గుపడుతుందని అభినందించారు.

చిత్రం..సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తున్న అర్చకులు