తెలంగాణ

చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌ కెటిఆర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: చేనేత రంగానికి చేయూత నివ్వడానికి తాను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారుతున్నానని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. చేనేతకు ప్రోత్సాహం అందించేందుకు ప్రతి సోమవారం చేనేత దుస్తులే ధరిస్తానన్నారు. తన పరిధిలో ఉన్న అన్ని శాఖల అధిపతులు, అధికారులు సైతం చేనేత వస్త్రాలతో హాజరు కావాలని, చేనేతను ఆదరించాలని కోరారు. మంత్రి సూచనతో జిల్లాల్లో సైతం కలెక్టర్లు ఈ కార్యక్రమం చేపట్టడంపై మంత్రి అభినందనలు తెలిపారు. కెటిఆర్ సోమవారం చేనేత దుస్తులు ధరించి కార్యాలయానికి వచ్చారు. చేనేత సంస్థ ఆన్‌లైన్ అమ్మకాలను పెంచే విధంగా వెబ్‌సైట్‌కు మెరుగులు దిద్దనున్నట్టు చెప్పారు. తెలంగాణ చేనేత శాఖ టిస్కో ద్వారా చేనేతను ప్రజల్లోకి తీసుకువెళతానన్నారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, మెట్రోవాటర్ వర్క్స్ ఎండి దానకిశోర్, హ్యాండ్‌లూమ్ డైరెక్టర్ శైలజా రామయ్యర్ తదితరులు చేనేత దుస్తులు ధరించారు.
మేము సైతం
చేనేతకు ప్రోత్సాహం అందించాలనే నిర్ణయంలో భాగంగా పంచాయితీరాజ్ శాఖ అధికారులు సైతం చేనేత దుస్తులు ధరిస్తారని, ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
జోగు రామన్న కృతజ్ఞతలు
అటవీ శాఖలో 66 మంది ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం..సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్య్రకమంలో కెటిఆర్‌ను అభినందిస్తున్న చేనేత విభాగం అధికారులు.