తెలంగాణ

మోడల్ స్కూల్‌లో నాగుపాము!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని పాలమాకుల మోడల్ స్కూల్లో శనివారం బ్రేక్ సమయంలో మెయిన్‌గేట్ వద్దకు చేరుకున్న నాగుపాము. సకాలంలో గుర్తించిన వాచ్‌మెన్ పిల్లలను బయటకు రావద్దని సూచించి, పంచాయతీ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. దాంతో వారంతా వచ్చి పామును పట్టి తీసుకువెళ్ళారు. పెను ప్రమాదం తప్పిందని విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
బ్యాంక్ డిపాజిట్ల కుంభకోణం కేసులో
ఘరానా మోసగాడి అరెస్ట్
రూ. 100 కోట్ల డిపాజిట్ల మళ్లింపులో మణి కీలక సూత్రధారి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 5: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మల్కాజ్‌గిరి శాఖలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల గోల్‌మాల్ కేసులో ఘరానా మోసగాడు మణి దామోదర్‌ను సిబిఐ అరెస్టు చేసింది. సుమారు రూ. 100 కోట్ల స్కాంలో నిందితుడు దామోదర్ ప్రధాన సూత్రధారి. ఖాయిలాపడిన పరిశ్రమలకు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఇతర ఖాతాల్లోకి మళ్లించిన దామోదర్‌ను సిబిఐ అధికారులు శనివారం ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన మణి దామోదర్ బి.టెక్ గ్రాడ్యుయేట్. హైదరాబాద్‌లో మరికొందరితో కలసి బ్యాంకులను మోసగిస్తున్నాడు. బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తూ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఎస్‌బిహెచ్ బ్యాంకులోని ఖాతాలను మళ్లించిన దామోదర్‌పై నమోదైన కేసును సిబిఐ దర్యాప్తు చేపట్టింది. హైకోర్టు ఆదేశానుసారం జనవరిలో ఎస్‌బిహెచ్ మాజీ ఉద్యోగి కెవి రమణరావును సిబిఐ జనవరిలో అరెస్టు చేసింది. అతనిని విచారించి సేకరించిన ఆధారాలతో దామోదర్‌ను అరెస్టు చేసి ఇల్లును సోదా చేశారు. కీలక పత్రాలతోపాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌బిహెచ్ మల్కాజ్‌గిరి శాఖలో రూ. 9.86 కోట్ల గల్లంతుపై ఎవరెవరికీ సంబంధం ఉందన్నవారిపై సిబిఐ ఆరా తీస్తున్నట్టు సిబిఐకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.