తెలంగాణ

కిటకిటలాడిన పిల్లలమర్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 1: 2017 నూతన సంవత్సర ఆరంభ దినమైన ఆదివారం భక్తుల తాకిడితో దేవాలయాలు కిటకిటలాడాయి. ప్రత్యేక సందర్శన స్థలాలు కూడా ప్రజల సందర్శనతో సందడిగా మారాయి. వివిధ పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలో గల వేయ్యి ఏళ్లకు పైగా చరిత్ర గలిగిన పర్యాటక కేంద్రంగా పేరొందిన పిల్లలమర్రి వేలాది మంది సందర్శకుల రాకతో పులకించిపోయింది. పిల్లలమర్రికి వేలాదిమంది ప్రజలు వచ్చి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అక్కడ మర్రిచెట్టు ఊడలపై చిన్నాపెద్ద తేడా లేకుండా మంచి వాతావరణంలో ఉల్లాసంగా గడిపారు. ఇదిలాఉంటే ఇక్కడ జంతు ప్రదర్శనశాలతో పక్షుల కిలకిలరాగాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
పురావాస్తు శాఖ పరిధిలో కొనసాగుతున్న పురావాస్తుకు సంబందించిన వివిధ శిల్పకళలను కూడా ప్రజలు తిలకించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పిల్లలమర్రికి జనంపోటెత్తడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యాటకశాఖ అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జిల్లా పర్యాటకశాఖ అధికారి పాండురంగారావు పిల్లలమర్రిలో ప్రత్యేకంగా అక్కడే తిష్టవేసి పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఆహ్లాదకరమైన వాతావరణంలోనే కుటుంబ సభ్యులంతా వనభోజనం తరహాలోనే భోజనం చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. మయూరి నర్సరిలో నూతనంగా నిర్మిస్తున్న పార్క్‌కు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. అటవీ ప్రాంతం కావడంతో అక్కడి కొండలు, గుట్టల అందాలను తిలకించిన జనం నూతన సంవత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల దగ్గర కూడా పర్యాటకుల సందడి కనిపించింది.

చిత్రం..పిల్లలమర్రి పర్యాటక కేంద్రంలో పోటెత్తిన జనం