తెలంగాణ

మనకి ఢోకా లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: కరెన్సీ నోట్ల రద్దు తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం క్రమంగా దారిన పడుతున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆదాయం పూర్తిగా పడిపోతుందని ఆందోళన చెందినప్పటికీ పరిస్థితి క్రమంగా కుదుట పడుతోందని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖలో 30 శాతం వరకు ఆదాయం పడిపోగా, మిగిలిన శాఖల్లో ఆదాయం మరీ అంత ఎక్కువగా ఏమీ పడిపోలేదని, ఒకటి రెండు నెలల్లో పరిస్థితి దారిలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో 21శాతం వృద్ధి రేటు నమోదు కావడం, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందుతుండడం వల్ల కరెన్సీ రద్దు గండం నుంచి రాష్ట్రం గట్టెక్కినట్టేనని అధికారులు తెలిపారు.
కరెన్సీ రద్దు ప్రభావం రిజిస్ట్రేషన్ల ఆదాయం మీదనే ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం మొదటి నుంచి ఆంచనా వేసింది. అయితే రిజిస్ట్రేషన్ల ఆదాయం పైనే ఎక్కువ ప్రభావం పడినా పూర్తిగా పడిపోలేదని అధికారులు తెలిపారు. దాదాపు ఆరునెలల పాటు రిజిస్ట్రేషన్ల ఆదాయం కోలుకోలేని విధంగా పడిపోతుందని భావించారు, అయితే నవంబర్ 8 తరువాత ఇప్పటి వరకు చూస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 40శాతం వరకు తగ్గినట్టు అధికారులు తెలిపారు. నవంబర్ 8కి ముందు భూములు, ఇళ్లు , ప్లాట్లు , ఫ్లాట్లు కొనుగోలు అమ్మకాలకు ఒప్పందాలు చేసుకున్న వారు నోట్ల రద్దు తరువాత రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. సాధారణంగా ఎక్కువ మొత్తం అప్పటికే చెల్లించేసి ఉండడం వల్ల కరెన్సీ రద్దు చేసినా ఒప్పందం అమలు కోసం ముందుకు రావడం వల్ల ఆదాయం అనుకున్న స్థాయిలో పడిపోలేదని అధికారులు తెలిపారు. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సగటున నెలకు 350 కోట్ల రూపాయల ఆదాయం లభించేది, ఇప్పుడు 225 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. రెండు మూడు నెలలు గడిచిన తరువాత పరిస్థితి మెరుగు పడుతుందని, పాత స్థాయిలో ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. మద్యం అమ్మకాలు సైతం నెలకు 25 కోట్ల రూపాయల వరకు పడిపోయాయి. అయితే నూతన సంవత్సరం రోజున జరిగిన అమ్మకాలు ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని ఆదుకునే విధంగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల తరువాత వాహనాల పన్ను ఆదాయం 20శాతం తగ్గింది.
నెలకు వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని ముందుగానే అంచనా వేశారు. ఆ మేరకు వ్యయాన్ని తగ్గించుకోవడానికి సిద్ధం కావాలని ఆర్థిక శాఖ అధికారులను ముందుగానే ముఖ్యమంత్రి సూచించారు. అయితే కేంద్రం ఆదుకుంటామని భరోసా ఇవ్వడంతో ఏ పథకానికి సైతం కోత విధించడం లేదు. రెండు మూడు నెలల పాటు ఆదాయం తగ్గవచ్చు కానీ ఆ తరువాత తిరిగి యథాప్రకారం ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గినా, కేంద్రం వడ్డీ రాయితీ ప్రకటించినందున ఆ మేరకు రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు.