తెలంగాణ

ఆస్పత్రుల్లోనే ప్రసవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగు పర్చాలని, వచ్చే బడ్జెట్‌లో ఈ శాఖకు నిధుల కేటాయింపు పెంచబోతున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వైద్య, ఆరోగ్యశాఖను బలోపేతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటుండటంతో ఇకనుంచి పేద గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రులలోనే పురుడు పోసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిధులను కూడా ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. ప్రగతి భవన్‌లో సోమవారం వైద్య, ఆరోగ్యశాఖలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సిఎం కెసిఆర్ దిశా నిర్దేశం చేశారు. ప్రసూతి సమయంలో శిశువుల మరణాలు జీరో స్థాయికి చేరాలని, పేద గర్భిణులు వంద శాతం ప్రభుత్వ ఆస్పత్రులలోనే పురుడు పోసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. మారుమూల ప్రాంతాలు, ఆదివాసీ, గిరిజన ప్రాంతాలపై దృష్టి పెట్టాలని సూచించారు. దీనిపై పేదలకు అవగాహన కలిగించేందుకు సాంస్కృతిక సారథి ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. అవసరమైన సిబ్బంది, పరికరాలు, మందులు సరిపడినన్ని ఉన్నప్పుడే పేదలకు నమ్మకం కలుగుతుందన్నారు. పేద గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే పెద్ద మొత్తంలో బిల్లులు వేస్తున్నారని, పైగా అవసరం లేకున్నా శస్త్ర చికిత్సలు చేస్తున్నారని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మఒడి లాంటి చర్యలు మరిన్ని చేపట్టాలన్నారు. పేద గర్భిణిలకు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందించాలని యోచిస్తున్నామన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా ఒకపూట పౌష్టికాహారాన్ని అందిస్తున్నప్పటికీ, మరింత సహాయం అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రసవం తర్వాత బిడ్డకు మూడు నెలల వయసు వచ్చే వరకు అవసరమైన కిట్‌ను ప్రభుత్వమై అందించాలని అధికారులకు సూచించారు. దీనికి ఎంత ఖర్చు అవుతుందో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. వచ్చే బడ్జెట్‌లో దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లోనే వైద్య, ఆరోగ్యశాఖకు నిధులు పెంచడం వంటి సంస్కరణలు చేపట్టామని, దీనివల్ల ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల సంఖ్య పెరిగిందన్నారు. గతంలోకంటే ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలు మెరుగుపడటంతో వైద్యులకు వేతనాలు కూడా పెంచాలని, గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో పని చేస్తున్న వైద్యలుకు అదనపు ప్రోత్సహకాలు ఇవ్వాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఢిల్లీలో మొహల్లా క్లినిక్ పేరిట బస్తీల్లో పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారని, హైదరాబాద్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా అలాంటి వైద్య సేవలు అందించడానికి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. వివిధ రాష్ట్రాలలో పేదలకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారుల బృందం అధ్యయనం చేస్తుందని, ఇప్పటికే బృందం తమిళనాడుకు వెళ్లివచ్చిందన్నారు. ఈ బృందం ఢిల్లీకి వెళ్లి అధ్యయనం చేయాల్సిందిగా సిఎం కెసిఆర్ ఆదేశించారు.