తెలంగాణ

ప్రకృతి ఒడిలో పాఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి) లో ‘ఓపెన్ ఎయిర్ క్లాసుల’కు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. హెచ్‌ఆర్‌డి ఆవరణలో చతురస్రం ఆకారంలో స్థలాన్ని ఎంపిక చేసి ఈ స్థలానికి నాలుగువైపులా మొక్కల సముదాయాన్ని నాటారు. హెచ్‌ఆర్‌డి డైరెక్టర్ జనరల్, ఎక్స్‌అఫీషియో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వినోద్ కె అగర్వాల్ నేతృత్వంలో సంస్థ సీనియర్ ఉద్యోగులు మొక్కలు నాటారు. ఈ సంస్థ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. నాలుగు క్లస్టర్లలో ప్రధానంగా మూడు రకాల మొక్కలున్నాయి. బ్రహ్మదేవుడికి గుర్తుగా జువ్విచెట్లను, విష్ణుదేవుడికి రూపంగా భావించే రావి చెట్లను, మహేశ్వరుడి రూపంగా భావించే మేడి చెట్లను నాటారు. సనాతన ధర్మంలో జువ్వి, రావి, మేడి చెట్లను అతిపవిత్రంగా భావిస్తారని అగ్రవాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కె. తిరుపతయ్య, జాయింట్ డైరెక్టర్ జనరల్ అనితతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆవరణలో సోమవారం మొక్కలు నాటుతున్న ఉద్యోగులు. చిత్రంలో హెచ్‌ఆర్‌డి డైరెక్టర్ జనరల్, ఎక్స్‌అఫీషియో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వినోద్ కె అగర్వాల్ ఉన్నారు.