తెలంగాణ

విధుల్లో ఉన్న ఖాకీలపై దూసుకెళ్లిన లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జనవరి 2: నాగార్జునసాగర్ దయ్యాలగండి వద్ద అదుపు తప్పి రోడ్డుపై అడ్డంగా బోల్తా పడిన గడ్డి ట్రాక్టర్‌ను పక్కకు జరిపించే పనిలో ఉన్న సాగర్ పోలీసులపై, చూసేందుకు వచ్చిన పౌరులపై బ్రేక్‌లు ఫెయిలైన లారీ దూసుకుపోవడంతో నలుగురి మృతి చెందారు. ఈ సంఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి 9-30 సమయంలో సాగర్ నుండి సమీపంలోని నెమ్మికల్ గోడుమరక తండాకు వెళ్తున్న గడ్డి లోడ్ ట్రాక్టర్ రోడ్డు పక్కన స్తంభానికి తాకడంతో ఇంజన్ నుండి ట్రాలీ ఊడిపోయి రోడ్డుపై అడ్డంగా బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదే మార్గంలో వెలుతున్న పెద్దవూర పోలీస్ స్టేషన్ చెందిన హోంగార్డు బాలునాయక్ తన ఇంటికి వెళ్తూ ఈ సమాచారాన్ని సాగర్ పోలీసులకు అందించాడు. సాగర్ ఎస్‌ఐ గౌరినాయుడు, ఎఎస్‌ఐ రాజు తమ సిబ్బందితో కలిసి పోలీస్ సుమోలో సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ పునరుద్ధరణకు వీలుగా గడ్డి ట్రాక్టర్ ట్రాలీని తొలగించే పనులు చేపట్టారు. ఇదే సమయంలో గుంటూరు నుండి హైదరాబాద్ వైపు వెలుతున్న లారీ బ్రేక్‌లు ఫెయిలై పోలీసు సుమోను, ఇతర వాహనాలను ఢీకొడుతూ ట్రాక్టర్ తొలగించే పనుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిపై, చూసేందుకు నిలబడిన ప్రజలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో హోంగార్డు బాలునాయక్ (43), సాగర్ ఎడమకాలువ పవర్‌హౌస్ డ్యూటీకి వెలుతున్న ఎస్‌పిఎఫ్ కానిస్టేబుల్ మరియదాసు (25)తో పాటు నెల్లికల్‌కు చెందిన నడ్డి చంద్రయ్య (45), ట్రాలీ తొలగింపు పనిలో ఉన్న మార్కపురం వెలుతున్న ప్రయాణికుడు హాఫీజ్ (19) చనిపోయారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలు కాగా, వారిని సాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో సాగర్ జెన్‌కో ఏఈ చంద్రవౌళి, గొడమరకతండాకు చెందిన మురళితో పాటు మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.