తెలంగాణ

అయూబ్‌ఖాన్ కేసులో ముమ్మర దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: గ్యాంగ్‌స్టర్ అయూబ్ ఖాన్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సౌత్‌జోన్ డిసిపి నేతృత్వంలోని ప్రత్యేక బృందం అయూబ్ ఖాన్ నేరచరిత్ర, కుల పర్యవేక్షణ, పాత కేసులు, చార్జీషీట్ దాఖలు వంటి అంశాలపై ప్రత్యేక బృందం దర్యాప్తు జరిపేందుకు పోలీస్ శాఖ అనుమతించింది. ఈ బృందం అయూబ్ ఖాన్ అనుచరుల కోసం గాలిస్తూ, అతనిపై గల కేసుల వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్టు తెలిసింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన కరుడుగట్టిన నేరస్థుడు అయూబ్‌ఖాన్ 72 కేసుల్లో నిందితుడు. గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్‌ను ముంబయిలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ అయూబ్‌ఖాన్‌ను తన నకిలీ పాస్‌పోర్టు ఆధారంగా ముంబయి ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారని, వారి సహకారంతోనే ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నామని డిసిపి సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణ వివరించారు. ఖాన్‌ను విచారిస్తున్నామని, అతనిపై పిడి యాక్టు పెడతామన్నారు.