తెలంగాణ

మియాపూర్ సిఐ, ఎస్‌ఐ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ సిఐ రమేష్, ఎస్‌ఐ రాములును కమిషనర్ సందీప్ శాండిల్య సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మియాపూర్ ఏవి కాలనీలో నివాసముంటున్న వెంకటరమణ వృద్ధ దంపతుల స్థలంపై రాజు అనే రియల్టర్ కన్నుపడింది. ఎలాగైనా ఈ స్థలాన్ని దక్కించుకోవాలని రాజు అనే రియల్టర్ కొంతకాలంగా వెంకటరమణ దంపతులను వేధించసాగాడు. కాగా, తన స్థలాన్ని రాజు అనే వ్యక్తి స్వాధీనం చేసుకోవాలని తన ఇంట్లో ఉన్న సామాన్లు బయట పడేశాడని, దీనిపై చర్య తీసుకోవాలని బాధితుడు వెంకటరమణ మియాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మియాపూర్ సిఐ రమేశ్, ఎస్‌ఐ రాములు పట్టించుకోలేదు. దీంతో బాధితుడు సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కమిషనర్ సందీప్ శాండిల్య సిఐ రమేశ్, ఎస్‌ఐ రాములును సస్పెండ్ చేశారు.