తెలంగాణ

రైతులకోసం గ్రోయన్ ఇండియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మేకిన్ ఇండియా పేరిట పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నట్టుగానే వ్యవసాయ రంగం అభివృద్ధికి గ్రోయన్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టాలని ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ పిలుపునిచ్చారు. ఆర్థిక సమస్యలతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి లాభసాటిగా మార్చాలని సూచించారు. నగరంలోని ఆర్‌టిసి హాలులో శనివారం జరిగిన అఖిలభారత రైతు సంఘం 29వ జాతీయ మహాసభల సందర్భంగా నిర్వహించిన సదస్సులో కీలక ఉపన్యాసం చేశారు. రైతులకు నేరుగా ప్రయోజనం అందే విధంగా నగదు బదీలీ విధానం ఉండాలని అన్నారు. వ్యవసాయ రంగం సమస్యలు గుర్తించిన ప్రభుత్వాలు వారికి ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. స్థిరమైన రాజకీయ నిర్ణయాలతోనే వ్యవసాయ రంగానికి మేలు చేయగలమన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, వ్యవసాయ రంగం పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పుడే గ్రామీణ భారతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిధుల కేటాయింపు మాత్రమే సరిపోదు, సమగ్ర అభివృద్ధి కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోగలగాలని అన్నారు. రైతులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని, దీని వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఇదో కాంప్లెక్స్ అయినా దృష్టి సారించాల్సిన తీవ్రమైన సమస్య అని అన్నారు. చిన్న రైతులు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని, సరైన ఆదాయం పొందలేకపోతున్నారని అన్నారు. తక్కువ ఉత్పత్తివల్ల మార్కెట్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారని చెప్పారు. మార్కెట్ గురించి వీరికి అంతగా అవగాహన లేకపోవడం, తక్కువ కమతం, తక్కువ పెట్టుబడి వీరిని దెబ్బతీస్తోందని తెలిపారు. 1942-43 బెంగాల్ కరువులో మూడు లక్షల మంది చనిపోయారని, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఆహార ధాన్యాలకు తీవ్రమైన కొరత ఉండేదని ఉప రాష్టప్రతి తెలిపారు. అప్పుడు ఆహార ధాన్యాల దిగుమతిపై ఆధారపడ్డామని చెప్పారు. 1951-52లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 52 మిలియన్ టన్నులు అయితే ఇప్పుడు 264 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత చేపట్టిన అనేక సంస్కరణల వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని అన్నారు. భూ సంస్కరణలు గణనీయమైన మార్పును తీసుకు వచ్చాయని తెలిపారు. పంచవర్ష ప్రణాళికలు, సస్య విప్లవం సమూలమైన మార్పులను తీసుకు వచ్చినట్టు చెప్పారు. హరిత విప్లవం తరువాత కూడా 60 శాతం భూమి సాగులో లేదని అన్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకరమని అన్నారు.