తెలంగాణ

మన టీవీలో ఐఐటి శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మేరకు మన టీవీలో (సాఫ్ట్‌నెట్)లో ఐఐటి మెయిన్స్, ఎంసెట్, నీట్ శిక్షణ తరగతుల ప్రసార కార్యక్రమాలు సోమవారం నాడు ప్రారంభం అయ్యాయి. అధ్యాపకుడు జె చంద్రశేఖర్ మాథ్స్-1 సబ్జెక్టులోని ఫంక్షన్స్ టాపిక్‌ను బోధించగా ముందే నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఉదయం ఆరు గంటలకు ప్రసారాలు ప్రారంభించారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం మూడు గంటల పాటు మన టీవీలో కొనసాగే ప్రసారాలు మరుసటి రోజు అదే సమయంలో ప్రతి రోజు బోధించే పాఠ్యాంశాలు మనటీవీ-2లో పున:ప్రసారం కానున్నాయి. ప్రసారాల ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య మన టీవీ స్టుడియోను సందర్శించారు. టీవీలో ప్రసారం అవుతున్న సబ్జెక్టును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సిఇఓ ఆర్ శైలేష్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉస్మానియా వర్శిటీ పరీక్షల కంట్రోలర్‌గా కుమార్
ఉస్మానియా యూనివర్శిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా ప్రొఫెసర్ ఎం కుమార్ నియమితులయ్యారు. సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కుమార్ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. కాగా కామర్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ వి అప్పారావు నియమితులయ్యారు.