తెలంగాణ

రెండో వారంలో రాహుల్ రాక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 2: కాంగ్రెస్ శ్రేణులను బలోపేతం చేసేందుకు ఈ నెల రెండవ వారంలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జె.గీతారెడ్డి, వి.సునితారెడ్డి స్పష్టం తెలిపారు. సోమవారం సంగారెడ్డి ఐబిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పర్యటనపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రెండవ వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఎప్పుడు, ఎక్కడ పర్యటిస్తారనే విషయం ఇంకా ఖరారు కాలేదని, త్వరలోనే పర్యటన వివరాలు రావచ్చని అన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఎప్పుడు నియమిస్తారని ప్రశ్నించగా త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటైనప్పుడు కొత్త కమిటీలను నియమించక తప్పుతుందా అన్నారు. ప్రస్తుతానికి పాత పది జిల్లాలనే కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుని వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.

చిత్రం..సంగారెడ్డిలో విలేఖరుల సమావేశంలో మట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, సునితారెడ్డి