తెలంగాణ

అర్చకుల వేతనాల పెంపునకు అవసరమైతే చట్ట సవరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: అర్చకులు, ఆలయాలలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంపుదలకే అవసరమైతే చట్టసవరణ చేయాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. ఈ అంశంపై అడ్వకేట్ జనరల్‌తో చర్చించాలని కమిటీ నిర్ణయించింది. ఆర్చకులు, ఆలయాలలో పని చేసే ఇతర ఉద్యోగుల వేతనాలను పెంచే అంశంపై అధ్యయనం చేసి విధి విధానాలను రూపొందించడానికి మంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమైంది. వేతనాలను పెంచడానికి ఎంత డబ్బు అవసరం అవుతుంది, వీటిని ట్రెజరీల ద్వారా చెల్లించే అంశాలపై కమిటీ ప్రధానంగా చర్చించింది. వేతనాలు పెంచడం వల్ల భవిష్యత్‌లో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చట్ట సవరణ చేసే అంశాన్ని అడ్వకేట్ జనరల్‌తో చర్చించి మంత్రివర్గ ఉప సంఘానికి నివేదిక అందజేయాలని కమిటీ నిర్ణయించింది. చట్ట సవరణను ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాలలోనే చేయాలని అర్చకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రితో చర్చించనున్నట్టు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. వేతనాల పెంపు కమిటీ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, అర్చకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల తరఫున అంగు ఉపేంద్ర శర్మ, గంగు భానుమూర్తి, మోహన్, రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు.

చిత్రం..సోమవారం హైదరాబాద్‌లో మంత్రి ఇంద్రకఠణ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన అర్చకుల వేతన కమిటీ