తెలంగాణ

పాలమూరుకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి హైకోర్టులో ఊరట లభించింది. గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సదరన్ రీజియన్ బెంచ్ విధించిన స్టేను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. తమ వాదనలు వినకుండానే ఎన్జీటీ స్టే విధించిందన్న తెలంగాణ వాదనకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా జనవరి 17 వరకు స్టే ఇచ్చిందని, ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేయాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదించారు. ఇదే ప్రాజెక్టు విషయంలో గతంలో నాగం జనార్దన్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారణకు హైకోర్టు నిరాకరించిందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు. రాజకీయ ప్రయోజనాలతో పిటిషన్ దాఖలైందని వాదించారు. 1131 గ్రామాల ప్రజలకు మంచినీరు అందించే ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందన్నారు. తెలంగాణ వాదనను విన్న హైకోర్టు, ఎన్జీటీ విధించిన స్టేను ఎత్తివేసింది.
279 హెక్టార్ల అటవీ భూమిలో అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారంటూ గత డిసెంబర్ 1న బి హర్షవర్థన్‌రావు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ, ఎత్తిపోతలపై స్టే విధించింది. దీంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదన వినకుండానే ఏకపక్షంగా స్టే ఇచ్చారని హైకోర్టులో వాదించింది. జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎ శంకర్‌నారాయణలతో కూడిన డివిజన్ బెంచ్‌లో ఏజీ రామకృష్ణారెడ్డి ప్రభుత్వ వాదనలు వినిపించారు. 1131 గ్రామాల్లోని తాగునీటి సమస్య పరిష్కరించటంతోపాటు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.3 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టు వివరించారు. రాజకీయ దురుద్దేశంతోనే ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారని ఏజీ వాదించారు. ఎన్జీటీ స్టేవద్ద పనులు నిలిచిపోయి పది కోట్ల వరకు ప్రాజెక్టుకు నష్టం వాటిల్లిందని బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్జీటీ ఆదేశాలకు హైకోర్టులోకాకుండా సుప్రీంకోర్టులో ప్రశ్నించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రచనారెడ్డి వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఎన్జీటీ విధించిన స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు బెంచ్ తీర్పునిచ్చింది.
అడ్డంకులు తొలగినట్టే..
జాతీయ హరిత ట్రిబ్యునల్ స్టే ఎత్తివేతతో పాలమూరు ఎత్తిపోతల పనులు నిరాఘాటంగా సాగిపోతాయని అధికార్లు అంటున్నారు. దక్షిణ తెలంగాణకు వరప్రసాదంగా భావిస్తున్న ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా పాలమూరు నుంచి శాశ్వతంగా కరవును పారదోలే అవకాశం ఉందని అంటున్నారు. పాలమూరు ఎత్తిపోతలపై గతంలో ఆంధ్ర ప్రభుత్వం అభ్యింతరాలు వ్యక్తం చేసినపుడు, కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి సమక్షంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై వివాదాన్ని పరిష్కరించుకున్న సంగతి తెలిసిందే.